దిగ్బోయ్ (అస్సాం): విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని చెప్పి మాట తప్పారంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. నల్లధనాన్ని తెప్పించి దేశంలోని ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. లిక్కర్ రారాజు విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీలను విదేశాల నుంచి ఇంకా ఎందుకు రప్పించలేదని గురువారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో రాహుల్ దుయ్యబట్టారు.
మాల్యా విదేశాలకు పోయే రెండు మూడు రోజుల ముందు పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడారని, వారేం చర్చించారో చెప్పాలన్నారు. ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి లోక్‌సభ కమిటీ ఇచ్చిన నోటీసులకు రాహుల్ బదులిచ్చారు. తనకు బ్రిటిష్ పౌరసత్వం లేదని స్పష్టంచేశారు.
మాల్యా, లలిత్‌లను ఎందుకు రప్పించలేదు?: రాహుల్
Published Fri, Apr 1 2016 1:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement