రాహుల్ దర్శనమిచ్చాడు.. | Rahul Gandhi meets farmers | Sakshi
Sakshi News home page

రాహుల్ దర్శనమిచ్చాడు..

Published Sat, Apr 18 2015 12:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రాహుల్ దర్శనమిచ్చాడు.. - Sakshi

రాహుల్ దర్శనమిచ్చాడు..

న్యూఢిల్లీ:  సుదీర్ఘ  సెలవు తర్వాత  రెండురోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ  పనిలో పడుతున్నట్టు కనిపిస్తోంది. శనివారం ఉదయం వివిధ రైతుసంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే  రైతుర్యాలీకి సన్నాహకంగా  వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రైతు ప్రతినిధులు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు.

రాజస్థాన్,  పంజాబ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో భూసేకరణ సవరణ బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వ భూసేకరణ సవరణ బిల్లు, రైతు, పేద ప్రజల వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్  పార్టీ ఆదివారం కిసాన్ ఖేత్ మజ్దూర్ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకే రాహుల్ సుదీర్ఘంగా 57 రోజుల సెలవు తీసుకున్న తర్వాత 'ఎక్కడినుంచో' తిరిగి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement