
రాహుల్‌కు తప్పిన ప్రమాదం
కిసాన్ ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి త్రుటిలో విద్యుదాఘాతం తప్పింది.
ఆగ్రా: కిసాన్ ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి త్రుటిలో విద్యుదాఘాతం తప్పింది. శనివారమిక్కడ అగ్రసేన్ విగ్రహానికి పూమాల వేస్తున్నప్పుడు పైన వేలాడదీసిన విద్యుత్ తీగ రాహుల్ తలకు తగిలింది.
వెంటనే ఆయన కిందకు వంగి వెనక్కి జరిగారు. పక్కనే నిల్చున్న యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ రాహుల్‌ను మీరు క్షేమమేకదా అని అడగ్గా ‘ మీరు నాకు కరెంట్ షాకిచ్చారు’ అని హాస్యమాడారు.