న్యూఢిల్లీ: తమ శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంఘాలతో చర్చించిన మీదట రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్–డీ ఉద్యోగులే సఫాయి వాలాలు. ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్‌లుగా సంబోధిం చాల్సి ఉంటుందని తెలిపింది. వీరి ఎంపిక, నియామక విధానం, అర్హతలు, సీనియారిటీ, పదోన్నతి ప్రక్రియ, వేతనంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని జోనల్ విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment