![Rajesh Misra Says Age gap, Income My Concerns - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/11/Sakshi_Misra.jpg.webp?itok=J4aLKLXP)
లక్నో: ‘నా కూతురికి హాని తలపెట్టాలని కలలో కూడా అనుకోను. వారిద్దరూ ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. నా కూతురి వివాహాన్ని నేను వ్యతిరేకించలేదు. ఆమె పెళ్లాడిన వ్యక్తి వయసులో తనకంటే 9 ఏళ్లు పెద్దవాడు. పైగా అతడి సంపాదన కూడా అంతంత మాత్రమే. అందుకే వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందాన’ని ఉత్తరప్రదేశ్‌లోని బిథారి చేన్‌పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా తెలిపారు. తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన కుమార్తె సాక్షి మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో రాజేశ్ మిశ్రా స్పందించారు.
తన అభీష్టానికి వ్యతిరేకంగా దళితుడిని పెళ్లాడిన కూతురిని చంపాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఈ వ్యవహారం గురించి బీజేపీ అధినాయకత్వానికి వివరించానని చెప్పారు. సాక్షి మిశ్రా మేజర్ అని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు ఉందన్నారు. ఆమె విషయంలో తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు జోక్యం చేసుకోవవద్దని సూచించారు. నియోజకవర్గ పనులతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు రాజేశ్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు)
Comments
Please login to add a commentAdd a comment