
బెంగళూరు: డిస్కవరీ ఛానెల్ చూసే వారికి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షో గురించి తెలిసే ఉంటుంది. ఈ షోని మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్గ్‌తో ఈ షోని నడిపిస్తుంటాడు. ఇటీవల ప్రధాని మోదీ కూడా బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ప్రధాని, గ్రిల్స్.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్రను డిస్కవరి ఛానల్ మనోహారంగా చూపించింది. (మోదీ వర్సెస్ వైల్డ్)
ఇప్పుడు ఇదే కార్యక్రమానికి తమిళ నటుడు రజనీకాంత్ హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్నాటకలోని బందిపుర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగనుంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్‌కు రజనీ అక్కడ రెండు రోజులుపాటు హాజరుకానున్నట్లు సమాచారం. మొత్తం నాలుగు లొకేషన్లలో షూటింగ్ కోసం పర్మిషన్ ఇచ్చారు. బందిపుర వైల్డ్ లైఫ్ పార్క్, ప్రకృతి పరిరక్షణ కోసం ఇద్దరు స్టార్స్ మాట్లాడనున్నారు. ఫిల్మ్ స్టార్ రజనీకాంత్ .. ప్రస్తుతం బందిపుర రిసార్ట్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment