బ్యాక్‌ టు చెన్నై | Rajinikanth Injured During Filming Of Man Vs Wild With Bear Grylls | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు చెన్నై

Published Wed, Jan 29 2020 12:03 AM | Last Updated on Wed, Jan 29 2020 4:26 AM

Rajinikanth Injured During Filming Of Man Vs Wild With Bear Grylls - Sakshi

రజనీకాంత్‌,బేర్‌గ్రిల్స్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి గాయా లయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌లో తగిలిన గాయాలు కాదు. బుల్లితెర షో చిత్రీకరణ సమయంలో రజనీకి స్వల్ప గాయాలయ్యాయి. అసలు విషయానికి వస్తే.. డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమం చిత్రీకరణలో పాల్గొన డానికి రజనీ మైసూర్‌ వెళ్లారు. ఈ షోతో  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్రిటన్‌ సాహసికుడు బేర్‌గ్రిల్స్‌ రజనీకాంత్‌తో కలసి సాహసం చేయడానికి సిద్ధమయ్యాడు. మైసూరు జిల్లా గుండ్లుపేట తాలూకా బండీపుర అభయారణ్యంలో పులుల సంరక్షణ ప్రదేశంలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొనడానికి రజనీ సోమవారమే బండీపురకు చేరుకోగా బేర్‌ గ్రిల్స్‌ మంగళవారం ఉదయం వెళ్లారు.

మంగళవారం మద్దూరు పరిధిలోని అటవీప్రాంతం చమ్మనహళ్లలో చిత్రీకరణ చేస్తుండగా రజనీకి స్వల్పగాయం అయింది. దాంతో చికిత్స కోసం ఆయన చెన్నైకి వెళ్లిపోయారు. మనుషులు, వన్యజీవుల మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించేందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బుధవారం నటుడు అక్షయ్‌కుమార్‌ బేర్‌ గ్రిల్స్‌తో కలసి షూటింగ్‌లో పాల్గొననున్నారు. గత ఏడాది బేర్‌తో కలసి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌ అడవుల్లో డాక్యుమెంటరీలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement