Man vs Wild
-
జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్
జియో తన ఫైబర్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. భారత్ లో అత్యంత ప్రజాదరణ గల డిస్కవరీ ప్లస్ కంటెంట్‌ను జియో తన ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా డిస్కవరీ ప్లస్ సైన్స్, అడ్వెంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ యానిమేషన్ వంటి కంటెంట్‌ను జియోఫైబర్ వినియోగదారులు ఉచితంగా ఆస్వాదించవచ్చు. డిస్కవరీ ప్లస్ ప్లాట్‌ఫాం ప్రేక్షకుల కోసం నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను హోస్ట్ చేస్తుంది. ఈ స్ట్రీమింగ్ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీతో సహా పలు భాషలలో కంటెంట్ అందిస్తుంది. కొత్త, ఇప్పటికే జియో ఫైబర్ వినియోగదారులు రూ.999తో పాటు దాని పై ప్లాన్ ఎంచుకుంటే మాత్రమే ఈ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల జియోఫైబర్ కస్టమర్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఇంటూ ది వైల్డ్ సిరీస్‌తో సహా ఇతర డిస్కవరీ నెట్వర్క్ ప్రీమియం షోలు యాక్సెస్ చేయడానికి అవకాశం లభిస్తుంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్‌పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేకమైన కంటెంట్ చూడవచ్చు. వీటితో పాటు జియోఫైబర్ వినియోగదారులు వందే భారత్ ఫ్లైట్ IX1344: హోప్ టు సర్వైవల్, సీక్రెట్స్ ఆఫ్ సినౌలి, మిషన్ ఫ్రంట్‌లైన్, సూపర్ సోల్, లడఖ్ వారియర్ తదితర సిరీస్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే జియో 14 సంస్థలకు చెందిన ఓటిటీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తుంది. ఇప్పడు ఆ జాబితాలో డిస్కవరీ ప్లస్ వచ్చి చేరింది. చదవండి: ఈ బ్యాంకు పాస్‌బుక్, చెక్‌బుక్‌లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు -
రోజు ఉదయం ఆవు మూత్రం తాగుతా..
ఆవు మూత్రానికి భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటికి గ్రామాల్లో చిన్న పిల్లలకు ఆవు పంచకంతో ఒక్కసారి అయిన స్నానం చేయిస్తారు. ఇక చాలా మంది దీన్ని సేవిస్తారు. ఈ నేపథ్యంలో హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఆయుర్వేద పరంగా ఇది ఎంతో మంచిదన్నారు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. అక్షయ్ ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఏనుగు మలవిసర్జనతో చేసిన టీని తాగారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బేర్ గ్రిల్స్, హ్యూమా ఖురేషిలతో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నారు అక్షయ్. దానిలో భాగంగా హ్యుమా ఖురేషి ‘ఆ ప్రత్యేకమైన టీని తాగమని అక్షయ్‌ని ఎలా ఒప్పించారని’ బేర్ గ్రిల్స్‌ని అడిగింది. అందుకు ‘ఆ పని ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ చెడ్డ పని మాత్రం కాదు’ అన్నారు బేర్ గ్రిల్స్. (చదవండి: రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్) ఇంతలో అక్షయ్ ‘నేను ప్రతి రోజు ఆము మూత్రం తాగుతాను. కాబట్టి ఈ టీ తాగడానికి నేను పెద్దగా భయపడలేదు.. ఆశ్చర్యపడలేదు’ అని తెలిపారు. అక్షయ్ ఆవు మూత్రం తాగుతానని తెలపడం ఇదే ప్రథమం. ఈ సమాధానంతో హ్యుమా ఖురేషీతో పాటు నెటిజనులు కూడా ఆశ్చర్యపోయారు. అక్షయ్ మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదపరంగా ఆవు మూత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేను ప్రతి రోజు సేవిస్తాను. ఏనుగు వ్యర్థాలతో చేసిన టీ కూడా ఆయుర్వేదపరంగా మంచిదే. అందుకే తాగడానికి ఇబ్బంది పడలేదు’ అని తెలిపారు. ఇక ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో రేపు (సెప్టెంబర్ 11) రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ చానల్లో.. సెప్టెంబర్ 14 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో టెలికాస్ట్ అవుతుంది. View this post on Instagram @beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin A post shared by Akshay Kumar (@akshaykumar) on Sep 10, 2020 at 2:06am PDT -
బేర్‌గ్రిల్స్‌తో సాహసయాత్రలో అక్షయ్ కుమార్!
ముంబై: డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ‘ఇన్ టూ ది వైల్డ్’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవిలో ఉండే జంతువులను, సాహోసపేతమైన చర్యలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తప్పక తెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సాహసవీరుడు బియర్ గ్రిల్స్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అలాగే సూపర్‌స్టార్ రజనీ కాంత్ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో బేర్ గ్రిల్స్‌తో పాటు హీరో అక్షయ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. చదవండి: రజనీకాంత్ వర్సెస్ బియర్ గ్రిల్స్ ఇందుకు సంబంధించిన టీజర్‌ను అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు. పిచ్చి ఉన్న వాళ్లే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్లగలుగుతారు’ అని అక్షయ్ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ యేడాది మొదటిలో జనవరి నెలలో ఈ షూటింగ్ జరిగింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ఈ షూటింగ్‌ను అక్షయ్ కుమార్ ఒక్కరోజులో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు 11న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ ఇండియాలోప్రసారం చేస్తుండగా.. డిస్కవరీ చానెల్లో సెప్టెంబరు 14 రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. View this post on Instagram You thinking I mad… but mad only going into the wild. #IntoTheWildWithBearGrylls @beargrylls @discoveryplusindia @discoverychannelin A post shared by Akshay Kumar (@akshaykumar) on Aug 20, 2020 at 10:32pm PDT -
రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్
సూపర్ స్టార్ రజనీకాంత్, సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’. డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ వెబ్ సిరిస్ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటినుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రియాలిటీ టెలివిజన్ షో ప్రీమియర్ ఎపిసోడ్ మార్చి 23న డిస్కవరీ నెట్వర్క్(12 ఛానెల్స్)లో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఈ షో రెండో అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ ఏడాదిలో అధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా, అదేవిధంగా రియాలిటీ షోల చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పొందిన రెండో ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. (రజనీకాంత్ సాహసయాత్ర) బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం.. ‘ఇన్‌టూ ద వైల్డ్ బేర్ గ్రిల్స్’ ప్రీమియర్ షోను సుమారు 12.4 మిలియన్ల మంది విక్షించారు. ఇది గత నాలుగు వారాలతో పోల్చితే సుమారు 86 శాతం అధికం. ఈ షోను తమిళ డిస్కవరీ చానెల్లో ప్రసారం చేయగా.. అత్యధికమంది విక్షించారు. ఇక తమిళ ఛానెల్స్.. కలర్స్ తమిళం, రాజ్ టీవీ, జయ టీవీ వంటి వాటిలో ప్రసారమయ్యే పలు షోలను రజనీ రియాలిటీ షో వెనక్కి నెట్టింది. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్ గ్రిల్స్ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రజనీకాంత్ ‘అన్నాత్త’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తీసుకురావడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. -
కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు..
నా జీవితం అంతా ఆశ్యర్యమేనని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన మొట్టమొదటి సారిగా నటించిన అడ్వెంచర్ డాక్యుమెంటరీ చిత్రం ది మ్యాన్ వర్సెస్ వైల్డ్. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్ గ్రిల్స్ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించారు. తాజాగా నటుడు రజనీకాంత్‌తో రూపొందించారు. ఆ మధ్య బెంగళూర్ సమీపంలోని అడవుల్లో చిత్రీకరించిన సన్నివేశాల్లో రజనీకాంత్ నటించారు. ఇందులో పలు సాహసోపేతమైన సన్నివేశాల్లో ఈ సూపర్‌స్టార్‌ను చూడబోతున్నాం. ఈ డాక్యుమెంటరీ చిత్రం రేపు (సోమవారం) రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నటుడు రజనీకాంత్ ఇటీవల బేర్ గ్రిల్స్‌తో కలిసి ఇన్ టు ది వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తన జీవితమే ఒక ఆశ్చర్యం అని పేర్కొన్నారు. ఒక బస్సు కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ స్టార్ నటులలో ఒకరుగా ఎదగడం వరకూ, ఇంకా పలు ఆశ్చర్యాలను చూస్తారని ఆయన అన్నారు. అందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రమే ఒక ఉదాహరణ అని అన్నారు. తాను ఇలాంటి డాక్యుమెంటరీ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదేవిధంగా డిస్కవరీ చానల్లో ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటానని భావించలేదన్నారు. ఆయన తన వ్యక్తిగత జీవితం, సినీ పయనం గురించి పలు విషయాలను పంచుకున్నారు. కాగా ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరువాత వైల్డ్ డాక్కుమెంటరీలో నటించిన వ్యక్తి రజనీకాంత్నేనన్నది గమనార్హం. చదవండి: నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు! ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, హిందీ, మరాఠి సహా 8 భాషల్లో విడుదల కానుంది. దీని కోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్త అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తాసుకురావడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది? -
కాక పుట్టిస్టున్న రజనీ ఫస్ట్ లుక్..!
-
కాక పుట్టిస్టున్న రజనీ ఫస్ట్ లుక్..!
43 ఏళ్ల సినీ ప్రయాణంలో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ బుల్లితెరపై తొలిసారి దర్శనమిస్తున్నాడు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షోలో భాగంగా బేర్ గ్రిల్స్‌తో కలిసి నెల క్రితం అడవిబాట పట్టిన రజనీ రెండు రోజులపాటు వన్య మృగాల ఆవాసంలో గడిపాడు. డిస్కవరీ చానెల్లో ఈ షో త్వరలో ప్రసారం కానున్న నేపథ్యంలో.. రజనీ, బేర్ గ్రిల్స్ ఫస్ట్ లుక్ బయటికొచ్చింది. అడవిలోని ఓ దారి పక్కన టాప్‌లెస్ జీప్‌ను ఆనుకుని ఉన్న రజనీ, గ్రిల్స్ లుక్ అదిరిపోయింది. అడ్వంచర్ థీమ్‌తో బ్యాగ్రౌండ్లో అగ్ని కీలలు, నిప్పు కణికలతో ఉన్న ఇద్దరి క్లోజప్ సరికొత్త అనుభూతి కలిగిస్తోంది. 15 సెకండ్ల నిడివి గల ఈ మోషన్ పోస్టర్‌ను గ్రిల్స్ ట్విటర్లో షేర్ చేశాడు. (చదవండి : నేను బాగానే ఉన్నాను: రజనీకాంత్) వన్య ప్రపంచం నేపథ్యంలో ఎంతో మందితో కలిసి పనిచేశానని, అయితే, రజనీకాంత్‌తో పనిచేయడం ప్రత్యేకమని అన్నాడు. త్వరలోనే డిస్కవరి చానెల్లో మీ ముందుంటామని తెలిపాడు. లవ్ ఇండియా. #తలైవా అంటూ గ్రిల్స్ ట్వీట్ చేశాడు. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. షూటింగ్ చేస్తున్న క్రమంలో రజనీకి స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ షోని మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్‌తో ఈ షోని నడిపిస్తుంటారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. (చదవండి : బ్యాక్ టు చెన్నై) -
నేను బాగానే ఉన్నాను: రజనీకాంత్
-
నేను బాగానే ఉన్నా: రజనీకాంత్
‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ గాయాలయ్యాయి. రజనీకాంత్ ఆయన రెండో కూతురు సౌందర్యతో కలిసి సోమవారం కర్ణాటక మైసూరు సమీపంలోని బందిపూర్కు వెళ్లారు. అక్కడ బందీపూర్ నేషనల్ పార్క్‌లో బేర్ గిల్స్‌తో కలిసి షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం షూటింగ్లో తలైవా భుజాలకు స్పల్ప గాయాలైనట్లు, యాంకిల్ బెణికినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కొంత సమయం విరామం తర్వాత షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. (రజనీకాంత్ వర్సెస్ బియర్ గ్రిల్స్) కాగా దీనిపై రజనీ స్పందించారు. చిన్న ముళ్ల కారణంగా శరీరంపై కొన్ని గీతలు ఏర్పడ్డాయని, అంతేగానీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని షూటింగ్ అనంతరం చైన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో బేర్ గ్రిల్స్. ఈ కార్యక్రమంలో ఇప్పటికే గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి పయనించిన విషయం తెలిసిందే. మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించిన రెండవ భారతీయ వ్యక్తిగా రజనీ నిలిచారు. -
బ్యాక్ టు చెన్నై
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి గాయా లయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్లో తగిలిన గాయాలు కాదు. బుల్లితెర షో చిత్రీకరణ సమయంలో రజనీకి స్వల్ప గాయాలయ్యాయి. అసలు విషయానికి వస్తే.. డిస్కవరీ చానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమం చిత్రీకరణలో పాల్గొన డానికి రజనీ మైసూర్ వెళ్లారు. ఈ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్రిటన్ సాహసికుడు బేర్‌గ్రిల్స్ రజనీకాంత్‌తో కలసి సాహసం చేయడానికి సిద్ధమయ్యాడు. మైసూరు జిల్లా గుండ్లుపేట తాలూకా బండీపుర అభయారణ్యంలో పులుల సంరక్షణ ప్రదేశంలో ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొనడానికి రజనీ సోమవారమే బండీపురకు చేరుకోగా బేర్ గ్రిల్స్ మంగళవారం ఉదయం వెళ్లారు. మంగళవారం మద్దూరు పరిధిలోని అటవీప్రాంతం చమ్మనహళ్లలో చిత్రీకరణ చేస్తుండగా రజనీకి స్వల్పగాయం అయింది. దాంతో చికిత్స కోసం ఆయన చెన్నైకి వెళ్లిపోయారు. మనుషులు, వన్యజీవుల మధ్య జరుగుతున్న సంఘర్షణ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించేందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బుధవారం నటుడు అక్షయ్‌కుమార్ బేర్ గ్రిల్స్‌తో కలసి షూటింగ్లో పాల్గొననున్నారు. గత ఏడాది బేర్‌తో కలసి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ అడవుల్లో డాక్యుమెంటరీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో రజనీకాంత్
-
రజనీకాంత్ వర్సెస్ బియర్ గ్రిల్స్
బెంగళూరు: డిస్కవరీ ఛానెల్ చూసే వారికి 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షో గురించి తెలిసే ఉంటుంది. ఈ షోని మొత్తం నడిపించే బేర్ గ్రిల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్గ్‌తో ఈ షోని నడిపిస్తుంటాడు. ఇటీవల ప్రధాని మోదీ కూడా బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ప్రధాని, గ్రిల్స్.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్రను డిస్కవరి ఛానల్ మనోహారంగా చూపించింది. (మోదీ వర్సెస్ వైల్డ్) ఇప్పుడు ఇదే కార్యక్రమానికి తమిళ నటుడు రజనీకాంత్ హాజరుకానున్నారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్నాటకలోని బందిపుర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగనుంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్‌కు రజనీ అక్కడ రెండు రోజులుపాటు హాజరుకానున్నట్లు సమాచారం. మొత్తం నాలుగు లొకేషన్లలో షూటింగ్ కోసం పర్మిషన్ ఇచ్చారు. బందిపుర వైల్డ్ లైఫ్ పార్క్, ప్రకృతి పరిరక్షణ కోసం ఇద్దరు స్టార్స్ మాట్లాడనున్నారు. ఫిల్మ్ స్టార్ రజనీకాంత్ .. ప్రస్తుతం బందిపుర రిసార్ట్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. (రికార్డు సృష్టించిన మోదీ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ) -
రికార్డు సృష్టించిన మోదీ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’
ముంబై : ప్రధాని మోదీ పాల్గొన్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రత్యేక ఎపిసోడ్ రికార్డు స్థాయిలో 36.9 లక్షల ప్రభావాలను (ఇంప్రెషన్స్) నమోదు చేసిందని డిస్కవరీ చానెల్ తెలిపింది. కార్యక్రమాన్ని ఎంత మంది, ఎంతసేపు చూశారో చెప్పేదే ఇంప్రెషన్. డిస్కవరీ చానెల్లో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో ఎప్పుడూ సాహసాలు చేస్తూ కనిపించే బేర్ గ్రిల్స్ గురించి అందరికీ తెలిసిందే. మోదీతో కలిసి బేర్ గ్రిల్స్ నటించిన ప్రత్యేక ఎపిసోడ్ ఈ నెల 12న రాత్రి 9 గంటలకు ప్రసారమైంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయపార్కులో ఈ ఎపిసోడ్‌లోని దృశ్యాలను చిత్రీకరించారు. మోదీ పాల్గొన్న ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చిందనీ, వినోదంతో కూడిన సమాచార కార్యక్రమాల్లో (ఇన్ఫోటైన్మెంట్) ఇప్పటి వరకు అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమం ఇదేనని డిస్కవరీ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) ఇచ్చిన లెక్కల ఆధారంగా డిస్కవరీ ఈ ప్రకటన చేసింది. ఆగస్టు 12న తొలిసారి ప్రసారమైన కార్యక్రమం, ఆ తర్వాత పునఃప్రసారాలు, మళ్లీ దూరదర్శన్ నేషనల్లో ప్రసారమైనప్పుడు.. అన్నీ కలిపి 4.27 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని చూశారనీ, ఎపిసోడ్ సక్సెస్‌కావడంతో ఇండియాలో పులుల సంరక్షణకు తాము కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు డిస్కవరీ తెలిపింది. -
‘మోదీ నటనకు అవార్డు ఇవ్వాల్సిందే!’
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేనప్పుడు చాలా పేదవాడిని. చాయ్ అమ్మాను. నాకస్సలు స్వార్థం లేదు. 18 ఏళ్లలో నేనిలా మాట్లాడం మొదటి సారి. నేను చాలా కష్టపడతాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి ‘డిస్కవరి’ ఛానల్ ప్రసారం చేసిన ‘మేన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా తనదైన శైలిలో స్పందించింది. ‘నేనప్పుడు చాలా పేద వాడిని. చాయ్ అమ్మాను.... ఆ కార్యక్రమంలో సాహసికుడు బియర్ గ్రిల్స్‌తో మోదీ ఈ మాటలు చెప్పడం మొదటిసారి కావచ్చుగానీ ఇది మాకు అరిగిపోయిన రికార్డు. మన్ కీ బాత్‌లో చాలాసార్లు విన్నాం’ అంటూ కొందరు ట్వీట్ చేయగా, మోదీ హిందీలో మాట్లాడడంపై ఎక్కువ మంది ట్వీట్ చేశారు. ‘ఒక్క ముక్క కూడా హిందీ భాష రాని బియర్ గ్రిల్స్, మోదీ మాటలను ఎలా అర్థం చేసుకున్నారబ్బా!’ అంటూ ఎక్కువ మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందీ తప్పనిసరైన సీబీఎస్ఈలో టెన్త్‌క్లాస్ బియర్ గ్రిల్స్ తప్పక పాసై ఉంటాడని ఒకరు, మోదీ హిందీ మాటలను ఓపిగ్గా ఆలకించిన బియర్ గ్రిల్స్ పరిస్థితి ఇలా ఉందంటూ ఓ సినిమా క్లిప్ మరొకరు పోస్ట్ చేశారు. మాంచి కమెడియన్‌గా నటించినందుకు మోదీకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని మరొకరు ట్వీట్ చేశారు. మోదీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు చూసినందున టీఆర్పీ రేటు అనూహ్యంగా పెరిగి డిస్కవరీ ఛానల్ అధిపతికి అంతులేని డబ్బు వచ్చి ఉంటుందని కొందరు వ్యాఖ్యానించారు. దేశంలోని చాలా గ్రామాల్లో పాఠశాలల్లో, పంచాయతీ కార్యాలయాల్లో బీజేపీ నాయకులు టీవీలు పెట్టి మోదీ కార్యక్రమాన్ని ప్రజలకు చూపించారు. ఇది ‘మేన్ వర్సెస్ వైల్డ్’ కాదని, మన్ కీ బాత్ అంటూ ఒకరిద్దరు వ్యాఖ్యానించగా ‘మోర్ మేన్ లెస్ వైల్డ్’... ‘మేన్ వర్సెస్ మేన్’ అంటు ఎక్కువ మంది స్పందించారు. (చదవండి: మోదీ వర్సెస్ వైల్డ్) -
మోదీ వర్సెస్ వైల్డ్
డెహ్రాడూన్: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు. బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై పలు ఆసక్తికర అంశాలను ప్రధాని ఆయనతో పంచుకున్నారు. ప్రకృతిలో మమేకమై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఈ సాహస యాత్ర సోమవారం డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా మోదీ, గ్రీల్స్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ ఇదే.. ► బేర్ గ్రిల్స్: జిమ్ కార్పెట్ ఫేమస్ కదా సార్? మోదీ: అవును ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. వృక్షాలపై అధ్యయనం చేయాలనకునేవారికి ఇక్కడుండే వందలాది రకాల చెట్లు ఉపయోగపడతాయి. పర్వతాలు, నదులతో పాటు అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత్ భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. 100 భాషలు, 1,600 యాసలు ఇక్కడ ఉన్నాయంటే భారత్‌లో ఏ స్థాయిలో భిన్నత్వం ఉందో మీరే అర్థం చేసుకోండి. ► ఈ ప్రాంతం ప్రమాదకరమని భావిస్తున్నారా? ప్రకృతిని మనమెప్పుడూ ప్రమాదకరంగా భావించకూడదు. ప్రకృతితో పోరాడితే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అదే ప్రకృతికి అనుగుణంగా కలిసిజీవిస్తే క్రూరమృగాలు కూడా సహకరిస్తాయి. ► మోదీజీ.. చిన్నప్పుడు మీరు మంచి స్టూడేంటా? మంచి స్టూడేంటా? కాదా? అని అంటే చెప్పలేను. ► ఇప్పుడు మీరు స్టైలిష్ దుస్తులు ధరిస్తున్నారు. చిన్నప్పుడూ ఇంతేనా? చిన్నప్పుడు నేను సామాన్యంగానే జీవించా. మురికి బట్టలే వేసుకున్నా. కానీ స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రమైన యూనిఫాంను వేసుకెళ్లేవాడిని. అందుకోసం నిప్పు కణికలను ఓ రాగి చెంబులో వేసి యూనిఫాంను ఇస్త్రీ చేసుకునే వాడిని. స్కూలు అయిపోయాక పాకెట్ మనీ కోసం నాన్నతో కలిసి రైల్వేస్టేషన్ దగ్గర టీ అమ్మేవాడిని. అలా రైల్వేలు నా జీవితంలో కీలకపాత్ర పోషించాయి. మా ప్రాంతంలో మంచు కురిశాక దానిపై ఉప్పులాంటి పొర ఏర్పడేది. దాన్ని జాగ్రత్తగా సేకరించి దాచి పెట్టుకునేవాళ్లం. స్నానం సమయంలో ఆ ఇసుకనే వాడేవాళ్లం. వేడి నీటిలో ఈ ఇసుక వేసి బట్టలను ఉతికేవాళ్లం. ► మీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లారట? అప్పుడు నా వయసు 17–18 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇళ్లు వదిలేశా. ప్రపంచాన్ని చూడాలనుకున్నా. హిమాలయాలకు వెళ్లగానే అక్కడి ప్రకృతి నచ్చింది. అక్కడే రుషులను కలుసుకున్నాను. అక్కడి మనుషుల మధ్య గడపడం అద్భుతమైన అనుభవం. అప్పటి శక్తే నన్ను ఇంకా నడిపిస్తోంది. నేను కలుసుకున్న రుషులంతా చాలా నిరాడంబరంగా ఉన్నారు. వాళ్లు ఒక్క కార్బన్ వ్యర్థాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సందర్భంగా మా నాన్న గురించి చెప్పాలి. మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వర్షాలు పడినప్పుడు మా నాన్న 25–30 పోస్ట్‌కార్డులు కొనేవారు. మా ప్రాంతంలో వర్షం పడిందని బంధువులందరికీ లేఖలు రాసేవారు. ఈ అనవసర ఖర్చు ఎందుకని మేం గోల చేసేవాళ్లం. అప్పట్లో నేనూ ఆశ్చర్యపోయేవాడ్ని. ప్రకృతి పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అనంతరం వారిద్దరూ కలిసి ఎత్తుగా ఉన్న గడ్డి ప్రాంతాన్ని దాటి నదీతీరానికి చేరుకున్నారు. ► మీరు ప్రధాని కావాలని ఎప్పుడు అనుకున్నారు? నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశా. అది నాకు కొత్త ప్రయాణం. ఆ తర్వాత ఈ పని(ప్రధాని బాధ్యతలు) చేపట్టాలని దేశం ఆదేశించింది. అందుకే ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఈ కాలంలో అభివృద్ధిపైనే నేను దృష్టి సారించాను. ప్రజల కలల్ని నా కలలుగా చేసుకుని పనిచేశా. ప్రజల కలల సాకారంతోనే నాకు సంతృప్తి లభిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను సెలవు తీసుకున్నా. ► ప్రధాని హోదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? మోదీ: నా మెదడు ఎప్పుడూ హోదా గురించి ఆలోచించదు. అలాంటివాటికి నేను అతీతుడ్ని. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా, నా మెదడు కేవలం పనిగురించే ఆలోచిస్తూ ఉంటుంది. పదవి అనేది నా ఆలోచనల్లోకి కూడా రాదు. ► చిన్నప్పుడు మీరు మొసలిని ఇంటికి తీసుకెళ్లారట.. అసలేం జరిగింది? ఓ అదా.. నేను రోజూ చెరువులో స్నానం చేసేవాడిని. అక్కడ కనిపించిన ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకెళ్లా. దీంతో మా అమ్మ ‘తల్లీబిడ్డలను వేరుచేయడం తప్పు. దాన్ని మనం పెంచుకోకూడదు. వెళ్లి వదిలేసి రా’ అని చెప్పింది. ప్రకృతిని చూసి మనమెప్పుడూ భయపడకూడదు. అలా భయపడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► భారీ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే ఆందోళనను ఎలా ఎదుర్కొంటారు? నా సమస్య ఏంటంటే నేనెప్పుడూ అలాంటి భయాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి భయం గురించి ప్రజలకు చెప్పలేను. నా స్వభావం చాలా సానుకూలమైనది. నేను ప్రతీదాంట్లో మంచినే చూస్తా. అనుకున్నపని జరగకపోతే బాధపడను. ► మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి? నేను యువతకు చెప్పేదొకటే. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడొద్దు. జీవితాన్ని సంపూర్ణంగా చూస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం కిందపడ్డా బాధపడకూడదు. తిరిగి పైకిలేవడానికి అక్కడే దారి మొదలవుతుంది. అనంతరం మోదీ, గ్రిల్స్ కలిసి నదిని దాటారు. ప్రధానిని టార్పాలిన్‌తో చేసిన తెప్పలో ఎక్కించిన గ్రిల్స్ దాన్ని తోసుకుంటూ నదిని దాటారు. ఈ సందర్భంగా వర్షం కురవడంతో మోదీ, గ్రిల్స్ తడిసిపోయారు. దీంతో ఇద్దరూ కరివేపాకులు కలిపిన టీని తాగారు. ► ప్రకృతి పరిరక్షణ అంటే మీకు ఇష్టమా..? మేం ఇండియాలో ప్రతీ చెట్టును దేవుడిగా భావిస్తాం. ఇక్కడ ‘తులసీ వివాహం’ అని సంప్రదా యం ఉంది. ఇందులో భగవంతుడిని, తులసి మొక్కకు ఏడాదికోసారి పెళ్లి చేస్తాం. అలా తుల సీదళాన్ని మా కుటుంబంలో భాగం చేసుకుంటాం. భూమిని కాపాడుకోవడమన్నది మన బాధ్య త. మన సుఖం కోసం ప్రకృతిని దోచుకుంటున్నాం. ► స్వచ్ఛ భారత్ కోసం ఏం చేయాలంటారు? బయటివారి వల్ల స్వచ్ఛభారత్ సాధ్యం కాదు. భారత్‌లో ఉండేవారి స్వభావం వల్లే దేశం క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత అన్నది భారతీయ సంస్కృతిలోనే ఓ భాగం. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అలవర్చుకోవాలి. ఈ విషయంలో మహాత్మాగాంధీ చాలా కృషి చేశారు. ► చంపడం నా స్వభావానికి విరుద్ధం ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కత్తి, తాడు, కర్ర సాయంతో బల్లెం తయారుచేశారు. పులులు తాము వేటాడే జంతువును సమీపించేవరకూ నక్కి ఉండి ఒక్కసారిగా దాడిచేస్తాయని గ్రిల్స్ తెలిపారు. పులి సమీపిస్తే ఇలా దాడిచేయాలంటూ బల్లెం వాడే పద్ధతిని చూపించారు. దీంతో మోదీ స్పందిస్తూ..‘చంపడం నా స్వభావానికి విరుద్ధం. ఈ ఆయుధాన్ని మీరే తీసుకోండి’ అని చెప్పారు. దీంతో గ్రిల్స్ దాన్ని తీసుకోబోతుండగా..‘పర్లేదు. మీకోసం నేను దీన్ని తీసుకుంటా’ అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రిల్స్ స్పందిస్తూ..‘సార్ ఒకవేళ ఇప్పుడు పులి వస్తే మీరెంత వేగంగా పరిగెత్తగలరు?’ అని ప్రశ్నించారు. దీంతో మోదీ..‘మీరు చెప్పండి’ అని అడిగారు. దీంతో గ్రిల్స్ ‘నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను’ అని జవాబిచ్చారు. వెంటనే మోదీ ‘అవునా!’ అంటూ తేరిపారా చూశారు. మోదీ మాటకు గ్రిల్స్ స్పందిస్తూ..‘ఇది పేలని జోక్ సార్. నేను మిమ్మల్ని వదిలి వెళతానా?’ అంటూ వ్యాఖ్యానించారు. బేర్‌తో కలసి తెప్పపై నదిని దాటుతున్న ప్రధాని -
గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. డిస్కవరీ చానెల్లో ప్రసారమయ్యే ప్రముఖ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో షో హోస్ట్ బేర్ గ్రిల్స్ భారత మీడియాతో ముచ్చటించారు. ‘దేశంలోనే ముఖ్యమైన వ్యక్తి అయిన మోదీ’తో తాను గడిపిన అనుభవాలను పంచుకున్నారు. గతంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఇదే తరహాలో బేర్ గ్రిల్స్ షో నిర్వహించారు. పలు విషయాల్లో మోదీకి, ఒబామాకు పోలికలు ఉన్నాయని ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మోదీ ఎంతో నిబద్ధత కలిగి ఉన్నారని, గతంలో ఒబామాతో కలిసి అలస్కా అడవుల్లో షో నిర్వహించిన సందర్భంగా ఆయన కూడా పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, మనం పర్యావరణాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత ఉందని ఇద్దరు నేతలూ అభిప్రాయపడ్డారని గ్రిల్స్ తెలిపారు. మనందరిని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేందుకు ప్రపంచ నేతలు ఇలా ప్రయత్నించడం తనకో భిన్నమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్న గ్రిల్స్.. మోదీని ఐకానిక్ గ్లోబల్ లీడర్ అంటూ ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముఖంపై చెక్కుచెదరని దరహాసంతో ఎంతో హుందా, వినమ్రంగా మోదీ వ్యవహరించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ‘పర్యావరణం అంటే మోదీకి ఎంతో శ్రద్ధ ఉంది. అందుకే ఆయన నాతో కలిసి ప్రయాణించారు. నిజానికి మోదీ యవ్వనంలో ఉన్నప్పుడే అడవుల్లో గడిపారు. అడవుల్లోనూ ఆయన అలవోకగా గడపడం, ఎంతో శాంతంగా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని గ్రిల్స్ తెలిపారు. గతంలో ఎన్నడు చూడనిరీతిలో మోదీని ఈ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తారని, ప్రపంచంలోనే టీవీలో అత్యధికంగా వీక్షించిన షోగా ఇది నిలుస్తుందనే నమ్మకముందని గ్రిల్స్ పేర్కొన్నారు. చదవండి: ఏ ప్రాణినీ చంపలేను: మోదీ