బేర్‌గ్రిల్స్‌తో సాహసయాత్రలో అక్షయ్‌ కుమార్‌! | Into The Wild Akshay Kumar with Bear Grylls The Teaser Looks Crazy | Sakshi
Sakshi News home page

బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్‌ కుమార్‌ సాహసయాత్ర

Published Fri, Aug 21 2020 4:06 PM | Last Updated on Fri, Aug 21 2020 4:53 PM

Into The Wild Akshay Kumar with Bear Grylls The Teaser Looks Crazy - Sakshi

ముంబై: డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ఇన్‌ టూ ది వైల్డ్‌’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవిలో ఉండే జంతువులను, సాహోసపేతమైన చర్యలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తప్పక తెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సాహసవీరుడు బియర్‌ గ్రిల్స్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అలాగే సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో బేర్‌ గ్రిల్స్‌తో పాటు హీరో అక్షయ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు.

చదవండి: ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ బియ‌ర్ గ్రిల్స్‌

ఇందుకు సంబంధించిన టీజర్‌ను అక్షయ్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు. పిచ్చి ఉన్న వాళ్లే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్లగలుగుతారు’ అని అక్షయ్‌ ఆ వీడియోకు క్యాప్షన్‌ జోడించారు. ఈ యేడాది మొదటిలో జనవరి నెలలో ఈ షూటింగ్‌ జరిగింది. కర్ణాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. ఈ షూటింగ్‌ను అక్షయ్‌ కుమార్‌ ఒక్కరోజులో పూర్తి  చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు 11న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్‌ ఇండియాలోప్రసారం చేస్తుండగా.. డిస్కవరీ చానెల్‌లో సెప్టెంబరు 14 రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement