Discovery channel
-
కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!
మనం డిస్కవరీ చానల్స్‌లో కొండచిలువ, అనకొండ లాంటి పాములు ఎలా జంతువులపై దాడి చేసి తినేస్తాయో చూసి ఉంటాం. అవి చూస్తే కాస్త రోమాలు నిక్కబొడుచుకుని వొళ్లు జలదరిస్తుంది. అచ్చం అలాంటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఆ ఫోటోలో ఏం ఉందంటే ఒక కొండచిలువ ఒక నక్కను గొంతు పిసికి చంపుతుంది. అసలు ఏముంది ఇందులో ఇలాంటివి చాలేనే చూశాం అంటారా!. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) అసలు విషయం ఇక్కడే ఉంది ఏంటంటే సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుని కూర్చొని ఉండగా కొండచిలువ నక్కను గొంతు పిసికి చంపేసింది. అయితే అందులో సీతకోక చిలుక ఎక్కడ ఉందో చెప్పండి" అనే క్యాప్షన్‌ని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో నెటిజన్లకు ఆ ఫోటోలో సీతాకోక చిలుక ఎక్కడ ఉంది అంటూ ఆసక్తిగా వీక్షించడంతో అది కాస్త పెద్ద రసవత్తరమైన అంశంగా మారుతుంది. ఇంతకీ ఆ సీతకోక చిలుక కొండచిలువ తలపై ప్రశాంతంగా కూర్చోని ఉంటుంది. నిజానికి చాలా మంది నెటిజన్లు గుర్తించలేకపోతారు. (చదవండి: ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో) Python strangles jackal. What do you think the butterfly is saying to the python?#TiredEarth pic.twitter.com/BgEjl3aeOt — Rebecca Herbert (@RebeccaH2030) October 27, 2021 -
తెలుగు ఘనతకు దృశ్య సాక్ష్యం
రేపు అంటే జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రతిష్టాత్మక డిస్కవరీ చానెల్లో ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ టెలికాస్ట్ కానుంది. తెలుగువారి ఘనతకు సాక్ష్యంగా నిలిచిన ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ మహా నిర్మాణ ఉత్కృష్టతను దేశానికే కాదు ప్రపంచానికీ తెలియచేయనున్న డాక్యుమెంటరీ ఇది. దీని దర్శకుడు తెలుగువాడైన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. గతంలో ‘ఇన్సైడ్ తిరుమల’ డాక్యుమెంటరీ తీసి 52 దేశాల్లో ప్రసారం చేసిన రాజేంద్ర డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తెలుగువారి ఘనతను చూపుతూ తన ఘనతనూ నిరూపించుకుంటున్నారు. ఆయన పరిచయం. ఫిక్షన్లో కల్పన ఉంటుంది. నాన్ ఫిక్షన్లో వాస్తవాల ఆధారం ఉంటుంది. వాస్తవాలను నిరూపించడం, సాక్ష్యాధారాలతో నిక్షిప్తం చేయడం ఉంటుంది. నాన్ ఫిక్షన్ విభాగానికి వచ్చే డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ ఒక విధంగా చరిత్రకారుడి పని చేస్తాడు. వర్తమానాన్ని చరిత్ర కోసం, చరిత్రను వర్తమానం కోసం అన్వేషిస్తాడు. కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స అలాంటి అన్వేషకుడు. ఆయన అన్వేషణ తెలుగువారి కోసం, తెలుగువారి తరఫున సాగడం తెలుగువారికి మేలు చేస్తోంది. లిఫ్టింగ్ ఏ రివర్ ‘జటిలమైన విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడమే అసలైన కష్టం’ అంటారు 52 సంవత్సరాల రాజేంద్ర శ్రీవత్స. ఢిల్లీ నుంచి టెలిఫోన్ ద్వారా ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డాక్యుమెంటరీ గురించి ఇంటర్వ్యూ ఇస్తూ ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నిర్మాణం. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కొన్ని ఉండొచ్చు. కాని అవన్నీ ఒకేచోట నిర్మితమయ్యాయి. కాళేశ్వరం పథకం అలాంటిది కాదు. అది మల్టీ లొకేషన్ ప్రాజెక్ట్. సాగునీటి కోసం తాగు నీటి కోసం సాగిన ఈ నిర్మాణం గురించి తెలుగువారే కాదు ప్రపంచమంతా తెలుసుకోవాలని ఈ డాక్యుమెంటరీ తీశాను. ఒక గంట దీని నిడివి’ అంటారు రాజేంద్ర. రెండేళ్ల కృషి ‘నేను ఢిల్లీలో ఉంటాను. 2017లో ఒక డాక్యుమెంటరీ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు న్యూస్పేపర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చదివాను. అరె... నేను తెలంగాణావాణ్ణి. పైగా మీడియాలో ఉన్నాను. నాకే దీని గొప్పతనం పూర్తిగా తెలియకపోతే సామాన్యుడికి ఏం తెలుస్తుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని ఫాలో అవుతూ డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నాను’ అంటారు రాజేంద్ర. అనుకున్నదే తడవు తన సంస్థ పల్స్ మీడియా తరఫున డాక్యుమెంటరీ నిర్మాణ పనుల్లో దిగారాయన. ‘రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ పనులను ఫాలో అవుతూ ఇంజనీర్లను కలుస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ ఇమేజ్ లు కాప్చర్ చేస్తూ వందల గంటల ఫుటేజ్ తీశాం. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో సంవత్సరం పట్టింది. తీసిన ఫుటేజ్ మొత్తం చూడటానికే 3 నెలలు పట్టింది. నేను తప్పక పాటించిన విషయం ఏమిటంటే అంతా ఆన్ లొకేషన్‌గా ఉండేలా చూడటం. యాక్చువల్ సౌండ్‌ను ప్రేక్షకులకు వినిపించడం. ఈ డాక్యుమెంటరీ చూసినవారు ప్రాజెక్ట్‌లో తిరిగిన భావనకు లోనవుతారు. సౌండ్ రికార్డిస్ట్ పి.డి.వాల్సన్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ప్రశాంత్ కారంత్, స్క్రిప్ట్ రైటర్ పూర్ణిమా రావు... వీరందరూ గొప్పగా పని చేయడం వల్ల ఇది సాధ్యమైంది’ అన్నారు రాజేంద్ర. ‘ఇంత గొప్ప నిర్మాణం అన్నిసార్లు సాధ్యం కాదు. దీనిని జీవితంలో ఒకసారి దొరికే అవకాశం అనుకుంటాను. అంతేకాదు శివుడి (కాళేశ్వరుడి) ఆజ్ఞతో ఈ పని జరిగి ఉండొచ్చనిపిస్తుంది’ అంటారు రాజేంద్ర. అంతర్జాతీయ చానెల్స్‌తో ‘2002లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యే కంటెంట్‌ను ప్రసారం చేయదలిచి డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ ను ఆహ్వానించింది. ఎంతోమంది అప్లై చేశారు. ఇద్దర్ని మాత్రమే ఎంచుకున్నారు. వారిలో నేనొకణ్ణి’ అంటారు రాజేంద్ర. ‘అదృష్టవశాత్తు దేశంలో శాటిలైట్ చానల్స్ వృద్ధి, నా కెరీర్ ఒకేసారి మొదలయ్యాయి. నా కెరీర్ మొదట్లోనే నేషనల్ జియోగ్రాఫిక్, డిస్కవరీ చానల్స్‌తో పని చేయడం వల్ల నాణ్యతతో ఎలా డాక్యుమెంటరీలు తీయాలో నాకు తెలిసింది. నిజానికి ఆ చానల్సే నాకు పని నేర్పాయి. దూరదర్శన్ దగ్గరి నుంచి అల్ జజీరా వరకూ అన్ని చానెల్స్‌కు డాక్యుమెంటరీలు చేశాను.’ అంటారు రాజేంద్ర. తిరుమల ఖ్యాతి నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ కోసం రాజేంద్ర తీసిన ‘ఇన్సైడ్ తిరుమల తిరుపతి’ 60 నిమిషాల డాక్యుమెంటరీ విశేష జనాదరణ పొందింది. ‘రోజూ 80 వేల మంది నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారు. కాని అంతమందిని ఎంతో గొప్పగా పర్యవేక్షిస్తారు. తిరుమల అంటే దర్శనం, ప్రసాదం మాత్రమే కాక ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆ డాక్యుమెంటరీ తీశాను. తెలుగువారి ఈ ఘన పుణ్యక్షేత్రం గురించి 2017లో ప్రసారం అయినప్పుడు సాధారణ టిఆర్పి కొలమానాలు ఆ ప్రేక్షకాదరణను కొలవడానికి పనికి రాలేదు. ఆ డాక్యుమెంటరీ 52 దేశాలలో ప్రసారమయ్యి తెలుగు వారి పుణ్యక్షేత్ర ఘనతను చాటింది ’ అంటారు రాజేంద్ర. ఇది కాకుండా దూరదర్శన్ కోసం ఎన్నో సైన్స్ కార్యక్రమాలు చేశారు రాజేంద్ర. అలాగే ‘స్వర్ణదేవాలయం’ మూలాలను తెలియ చేసే డాక్యుమెంటరీ ‘సీక్రెట్స్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్’, 2010 కాలంలో భారతదేశంలో ఊపందుకున్న సరొగసీ ధోరణిని డాక్యుమెంట్ చేస్తూ తీసిన ‘ఫైండింగ్ ఏ ఊంబ్’ రాజేంద్రకు చాలా పేరు తెచ్చాయి. సానుకూల దృక్పథం ‘దేశంలోగాని తెలుగు ప్రాంతాలలో గాని మంచి పనులు జరుగుతున్నాయి. కాని మనం చెడును మాట్లాడుకున్నట్టుగా మంచి మాట్లాడుకోము. ఉదాహరణకు దేశంలో సైన్స్ పురోగతి కోసం గొప్ప కృషి జరుగుతోంది. దానిని ప్రజలకు చెప్పడం లేదు. ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు చెప్పడం లేదు. మంచి మాట్లాడుతూ ఉంటే మంచి పనుల కొనసాగింపు ఉంటుంది’ అని ముగించారు కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ ప్రసార సమయాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స తీసిన 60 నిమిషాల డాక్యుమెంటరీ ‘లిఫ్టింగ్ ఏ రివర్’ డిస్కవరి చానల్లో జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతోంది. 6 భాషలలో దీనిని చూడొచ్చు. అలాగే డిస్కవరీ సైన్స్ చానెల్లో జూన్ 28 రాత్రి 9 గంటలకు, డిస్కవరీ టర్బో చానల్లో జూన్ 29 రాత్రి 9.50కు ఇది ప్రసారం కానుంది. డిస్కవరీ ఓటిటి చానల్ ‘డిప్లస్’లో జూన్ 25 నుంచి వీక్షణకు ఉంటుంది. పక్కా హైదరాబాదీ కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లో. తండ్రి సుధాకర రావు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్లో పని చేసేశారు. తల్లి శాంత. రాజేంద్ర నిజాం కాలేజ్‌లో డిగ్రీ చేసి తర్వాత ఢిల్లీ జె.ఎన్.యూలో పి.జి ఫిలాసఫీ చేయడానికి వెళ్లారు. ‘శ్రీధర్‌బాబు (మంథని ఎం.ఎల్.ఏ, మాజీ మంత్రి) నేనూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఢిల్లీలో అతను జెఎన్‌యూకు ‘లా’ చేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజాం కాలేజీలో నువ్వు క్రియేటివ్‌గా పనులు చేసేవాడివి కదా... ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్‌లోకి వెళ్లు అని అతడు ప్రోత్సహించేవాడు. అలా నేను ఫిల్మ్ మేకింగ్‌లోకి వచ్చాను’ అంటారు రాజేంద్ర. ‘నా భార్య మమతది వరంగల్. మా అబ్బాయ్ అమోఘ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు’ అని తెలియచేశారు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాళేశ్వరం అద్భుత సృష్టి.. ఈనెల 25న డిస్కవరీ చానల్లో
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఓ అద్భుతం. ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఘనత, ప్రాముఖ్యత మరోమారు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగనుంది. ఇప్పటికే కాళేశ్వరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ ప్రాజెక్టుపై ప్రఖ్యాత డిస్కవరీ చానల్ ఓ డాక్యుమెంటరీని ప్రపంచ ప్రజల ముందుంచనుంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో మరెక్కడా లేని అతి భారీ పంపులు, మోటార్లు, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ, అన్నిటికీ మించి తమ కలల ప్రాజెక్టు సాకారానికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించనుంది. గంట డాక్యుమెంటరీ గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న వైనంపై ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరిట డిస్కవరీ కథనాన్ని ప్రసారం చేయనుంది. ఈ నెల 25న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దీనిపై ప్రచారాన్ని మొదలు పెట్టిన డిస్కవరీ చానల్.. అన్ని దేశాల్లో తన మీడియా వ్యవస్థల ద్వారా ప్రోమోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. మనుషులు, మెషీన్లు కలిసి అసాధ్యమనుకున్న కార్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేశాయో తెలుసుకోవాలంటే దీన్ని వీక్షించాలని చెబుతోంది. అన్ని అంశాలూ కవర్ చేస్తూ.. 2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి చేసిన నిర్మాణాలను చూపుతూనే.. నీటిని ఆయకట్టు ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీలో చూపనుంది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకం కింద 20 పంపుహౌస్‌లలోని 104 భారీ పంపులు, మోటార్లను ఏర్పాటు చేయడంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేసిన కృషిని వివరించనుంది. ముఖ్యంగా గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం లోని 139 మెగావాట్ల భారీ పంపులు, మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. డిస్కవరీ వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. రూ.80 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, పారిశ్రామిక రంగాల వారికి ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు తదితర అంశాలను చానెల్ విశ్లేషించనుంది. రెండ్రోజుల కిందట కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ డాక్యుమెంటరీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని అంతర్జాతీయ సమాజం తెలుసుకుంటుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం, ఆర్ధిక సం ఘం, నీతిఆయోగ్, వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణులు, విదేశీ ప్రముఖులు కొనియాడటం గమనార్హం. -
25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఈ నెల 25న డిస్కవరీ చానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరుతో గంటపాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2017లో ఈ బృహత్తర పథకం మొదలుపెట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, బృహత్తర యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో దీన్ని ప్రసారం చేయనున్నారు. Save The Date! "Lifting A River" A @Discovery Channel exclusive documentary on #KaleshwaramProject on June 25, at 8 PM. Don't miss! @KTRTRS pic.twitter.com/kZwZUp755C — Telangana Digital Media Wing (@DigitalMediaTS) June 19, 2021 చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
బేర్‌గ్రిల్స్‌తో సాహసయాత్రలో అక్షయ్ కుమార్!
ముంబై: డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ‘ఇన్ టూ ది వైల్డ్’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవిలో ఉండే జంతువులను, సాహోసపేతమైన చర్యలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తప్పక తెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సాహసవీరుడు బియర్ గ్రిల్స్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అలాగే సూపర్‌స్టార్ రజనీ కాంత్ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో బేర్ గ్రిల్స్‌తో పాటు హీరో అక్షయ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. చదవండి: రజనీకాంత్ వర్సెస్ బియర్ గ్రిల్స్ ఇందుకు సంబంధించిన టీజర్‌ను అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు. పిచ్చి ఉన్న వాళ్లే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్లగలుగుతారు’ అని అక్షయ్ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ యేడాది మొదటిలో జనవరి నెలలో ఈ షూటింగ్ జరిగింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ఈ షూటింగ్‌ను అక్షయ్ కుమార్ ఒక్కరోజులో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు 11న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ ఇండియాలోప్రసారం చేస్తుండగా.. డిస్కవరీ చానెల్లో సెప్టెంబరు 14 రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. View this post on Instagram You thinking I mad… but mad only going into the wild. #IntoTheWildWithBearGrylls @beargrylls @discoveryplusindia @discoverychannelin A post shared by Akshay Kumar (@akshaykumar) on Aug 20, 2020 at 10:32pm PDT -
రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్
సూపర్ స్టార్ రజనీకాంత్, సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’. డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ వెబ్ సిరిస్ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటినుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రియాలిటీ టెలివిజన్ షో ప్రీమియర్ ఎపిసోడ్ మార్చి 23న డిస్కవరీ నెట్వర్క్(12 ఛానెల్స్)లో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఈ షో రెండో అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ ఏడాదిలో అధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా, అదేవిధంగా రియాలిటీ షోల చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పొందిన రెండో ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. (రజనీకాంత్ సాహసయాత్ర) బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం.. ‘ఇన్‌టూ ద వైల్డ్ బేర్ గ్రిల్స్’ ప్రీమియర్ షోను సుమారు 12.4 మిలియన్ల మంది విక్షించారు. ఇది గత నాలుగు వారాలతో పోల్చితే సుమారు 86 శాతం అధికం. ఈ షోను తమిళ డిస్కవరీ చానెల్లో ప్రసారం చేయగా.. అత్యధికమంది విక్షించారు. ఇక తమిళ ఛానెల్స్.. కలర్స్ తమిళం, రాజ్ టీవీ, జయ టీవీ వంటి వాటిలో ప్రసారమయ్యే పలు షోలను రజనీ రియాలిటీ షో వెనక్కి నెట్టింది. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్ గ్రిల్స్ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రజనీకాంత్ ‘అన్నాత్త’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తీసుకురావడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. -
వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ప్రిమియర్ షో అదుర్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ ప్రత్యేక ఎపిసోడ్ సోమవారం విడుదలైంది. రజనీ డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటీ నుంచి సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతోంది. ఇది చూసిన చూసిన ఆయన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బేర్ గ్రిల్స్‌తో సమానంగా ఆయన చేసిన స్టంట్స్ చూసి అభిమానులంతా ఇలా తలైవాను ఎప్పుడు చూడలేదంటూ.. ‘వయస్సు కేవలం సంఖ్య మాత్రమే’ ‘ఇది నిజంగా సూపర్ స్టార్ కోసమే’ ఇప్పడే ప్రిమియర్ చూశాను.. వావ్ ఎంత గొప్ప ఆత్మ విశ్వాసమో తలైవాది’ ‘అడవుల్లో ఆయన స్టైలిష్‌గా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక ‘ రజనీ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని బేర్ గ్రిల్స్ ఇదివరకే చాలసార్లు చెప్పారు. అయితే అది ఇప్పుడు రుజువైంది’ ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి అద్భతమైన ప్రదర్శన ఇచ్చారు. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (రజనీకాంత్ సూపర్ హీరో: బేర్ గ్రిల్స్) ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. కాగా బేర్ గ్రిల్స్‌తో పాటు తలైవా బండిపూర్ నేషనల్ పార్కు ఆరణ్యాన్ని అన్వేషించారు. ఈ క్రమంలో బేర్‌తో కలిసి రజనీ 50 అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప వంతేనను అధిరోహించడమే కాకుండా, అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా నడుము లోతు నీళ్లలో అవలీలగా నడుచుకుంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీ డిస్కవరీ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్‌ను జనవరిలో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన రజనీ చిన్న ముల్లు కారణంగా గీతలు పడ్డాయని స్పష్టం చేశారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అడ్వెంచర్ షోలో పాల్గొన్న రెండవ భారతీయుడు రజనీకాంత్ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించిన సంగతి తెలిసిందే. Just watched the premiere.,wooow whata beautiful Soul u r thalaivaaa😘😘😘...so stylish & charming even in the woods😍😍...thank u #beargrylls for returning our Thalaivar #Rajinikanth safely to us🙏🙏🙏...luv uuu thalaivaa😘😘 pic.twitter.com/SywKT4GvdI — Sri (@RRsri777) March 23, 2020 -
కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు..
నా జీవితం అంతా ఆశ్యర్యమేనని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన మొట్టమొదటి సారిగా నటించిన అడ్వెంచర్ డాక్యుమెంటరీ చిత్రం ది మ్యాన్ వర్సెస్ వైల్డ్. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్ గ్రిల్స్ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించారు. తాజాగా నటుడు రజనీకాంత్‌తో రూపొందించారు. ఆ మధ్య బెంగళూర్ సమీపంలోని అడవుల్లో చిత్రీకరించిన సన్నివేశాల్లో రజనీకాంత్ నటించారు. ఇందులో పలు సాహసోపేతమైన సన్నివేశాల్లో ఈ సూపర్‌స్టార్‌ను చూడబోతున్నాం. ఈ డాక్యుమెంటరీ చిత్రం రేపు (సోమవారం) రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నటుడు రజనీకాంత్ ఇటీవల బేర్ గ్రిల్స్‌తో కలిసి ఇన్ టు ది వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తన జీవితమే ఒక ఆశ్చర్యం అని పేర్కొన్నారు. ఒక బస్సు కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ స్టార్ నటులలో ఒకరుగా ఎదగడం వరకూ, ఇంకా పలు ఆశ్చర్యాలను చూస్తారని ఆయన అన్నారు. అందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రమే ఒక ఉదాహరణ అని అన్నారు. తాను ఇలాంటి డాక్యుమెంటరీ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదేవిధంగా డిస్కవరీ చానల్లో ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటానని భావించలేదన్నారు. ఆయన తన వ్యక్తిగత జీవితం, సినీ పయనం గురించి పలు విషయాలను పంచుకున్నారు. కాగా ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరువాత వైల్డ్ డాక్కుమెంటరీలో నటించిన వ్యక్తి రజనీకాంత్నేనన్నది గమనార్హం. చదవండి: నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు! ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, హిందీ, మరాఠి సహా 8 భాషల్లో విడుదల కానుంది. దీని కోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్త అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తాసుకురావడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది? -
రజనీకాంత్ సూపర్ హీరో: బేర్ గ్రిల్స్
ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సాహసయాత్రకు దిగాడు. అతనితో సమానంగా కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ సాహసాలకు పూనుకున్నాడు. అంతేకాక తను కళ్లజోడు ఎంత స్టైల్‌గా పెట్టుకుంటాడో చూపించాడు. అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా వీళ్లిద్దరూ నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఎంతో అనుభవజ్ఞుడైన బేర్ గ్రిల్స్ నీళ్లలో పడిపోగా సూపర్ స్టార్ మాత్రం ఎలాంటి అదురూబెదురూ లేకుండా దాన్ని అవలీలగా దాటేశాడు. ఇక డెబ్భైఏళ్ళ వయసులోనూ రజనీ అంత చురుకుగా, చలాకీగా పరుగెత్తుతూ కనిపించడం బేర్గ్రిల్స్నే ఆశ్చర్యపరిచింది. అతని శక్తియుక్తులను కళ్లారా చూశాక.. పొగడకుండా ఉండలేకపోయాడు. ‘యూ ఆర్ ఏ సూపర్ హీరో’ అని ప్రశంసించాడు. అంతేకాక ‘రజనీ.. అతనిపై విసిరిన ప్రతి చాలెంజ్‌ను స్వీకరించాడు’ అంటూ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ రెండో టీజర్‌ను బేర్ గ్రిల్స్ విడుదల చేశాడు. (రజనీకాంత్ వర్సెస్ బేర్ గ్రిల్స్) ఈ అడ్వెంచర్ యాత్రకు సంబంధించిన షూటింగ్ కర్ణాటకలోని బండీపూర్ అభయారణ్యంలో జరుపుకోగా పూర్తి కార్యక్రమం డిస్కవరీ చానెల్లో మార్చి 28న ప్రసారం కానుంది. సాహస యాత్రలకు మారుపేరైన బేర్ గ్రిల్స్ గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో దీనికి సంబంధించిన షూటింగ్ జరగ్గా ఈ ఎపిసోడ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ బల్లెం తయారు చేయడమే కాక తెప్పపై ప్రయాణించి ఆకట్టుకున్నారు. చదవండి: మోదీ వర్సెస్ వైల్డ్ ‘డిస్కవరీ’లో మోదీ -
మోదీ వర్సెస్ వైల్డ్
డెహ్రాడూన్: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు. బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై పలు ఆసక్తికర అంశాలను ప్రధాని ఆయనతో పంచుకున్నారు. ప్రకృతిలో మమేకమై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఈ సాహస యాత్ర సోమవారం డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా మోదీ, గ్రీల్స్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ ఇదే.. ► బేర్ గ్రిల్స్: జిమ్ కార్పెట్ ఫేమస్ కదా సార్? మోదీ: అవును ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. వృక్షాలపై అధ్యయనం చేయాలనకునేవారికి ఇక్కడుండే వందలాది రకాల చెట్లు ఉపయోగపడతాయి. పర్వతాలు, నదులతో పాటు అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత్ భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. 100 భాషలు, 1,600 యాసలు ఇక్కడ ఉన్నాయంటే భారత్‌లో ఏ స్థాయిలో భిన్నత్వం ఉందో మీరే అర్థం చేసుకోండి. ► ఈ ప్రాంతం ప్రమాదకరమని భావిస్తున్నారా? ప్రకృతిని మనమెప్పుడూ ప్రమాదకరంగా భావించకూడదు. ప్రకృతితో పోరాడితే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అదే ప్రకృతికి అనుగుణంగా కలిసిజీవిస్తే క్రూరమృగాలు కూడా సహకరిస్తాయి. ► మోదీజీ.. చిన్నప్పుడు మీరు మంచి స్టూడేంటా? మంచి స్టూడేంటా? కాదా? అని అంటే చెప్పలేను. ► ఇప్పుడు మీరు స్టైలిష్ దుస్తులు ధరిస్తున్నారు. చిన్నప్పుడూ ఇంతేనా? చిన్నప్పుడు నేను సామాన్యంగానే జీవించా. మురికి బట్టలే వేసుకున్నా. కానీ స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రమైన యూనిఫాంను వేసుకెళ్లేవాడిని. అందుకోసం నిప్పు కణికలను ఓ రాగి చెంబులో వేసి యూనిఫాంను ఇస్త్రీ చేసుకునే వాడిని. స్కూలు అయిపోయాక పాకెట్ మనీ కోసం నాన్నతో కలిసి రైల్వేస్టేషన్ దగ్గర టీ అమ్మేవాడిని. అలా రైల్వేలు నా జీవితంలో కీలకపాత్ర పోషించాయి. మా ప్రాంతంలో మంచు కురిశాక దానిపై ఉప్పులాంటి పొర ఏర్పడేది. దాన్ని జాగ్రత్తగా సేకరించి దాచి పెట్టుకునేవాళ్లం. స్నానం సమయంలో ఆ ఇసుకనే వాడేవాళ్లం. వేడి నీటిలో ఈ ఇసుక వేసి బట్టలను ఉతికేవాళ్లం. ► మీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లారట? అప్పుడు నా వయసు 17–18 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇళ్లు వదిలేశా. ప్రపంచాన్ని చూడాలనుకున్నా. హిమాలయాలకు వెళ్లగానే అక్కడి ప్రకృతి నచ్చింది. అక్కడే రుషులను కలుసుకున్నాను. అక్కడి మనుషుల మధ్య గడపడం అద్భుతమైన అనుభవం. అప్పటి శక్తే నన్ను ఇంకా నడిపిస్తోంది. నేను కలుసుకున్న రుషులంతా చాలా నిరాడంబరంగా ఉన్నారు. వాళ్లు ఒక్క కార్బన్ వ్యర్థాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సందర్భంగా మా నాన్న గురించి చెప్పాలి. మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వర్షాలు పడినప్పుడు మా నాన్న 25–30 పోస్ట్‌కార్డులు కొనేవారు. మా ప్రాంతంలో వర్షం పడిందని బంధువులందరికీ లేఖలు రాసేవారు. ఈ అనవసర ఖర్చు ఎందుకని మేం గోల చేసేవాళ్లం. అప్పట్లో నేనూ ఆశ్చర్యపోయేవాడ్ని. ప్రకృతి పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అనంతరం వారిద్దరూ కలిసి ఎత్తుగా ఉన్న గడ్డి ప్రాంతాన్ని దాటి నదీతీరానికి చేరుకున్నారు. ► మీరు ప్రధాని కావాలని ఎప్పుడు అనుకున్నారు? నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశా. అది నాకు కొత్త ప్రయాణం. ఆ తర్వాత ఈ పని(ప్రధాని బాధ్యతలు) చేపట్టాలని దేశం ఆదేశించింది. అందుకే ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఈ కాలంలో అభివృద్ధిపైనే నేను దృష్టి సారించాను. ప్రజల కలల్ని నా కలలుగా చేసుకుని పనిచేశా. ప్రజల కలల సాకారంతోనే నాకు సంతృప్తి లభిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను సెలవు తీసుకున్నా. ► ప్రధాని హోదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? మోదీ: నా మెదడు ఎప్పుడూ హోదా గురించి ఆలోచించదు. అలాంటివాటికి నేను అతీతుడ్ని. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా, నా మెదడు కేవలం పనిగురించే ఆలోచిస్తూ ఉంటుంది. పదవి అనేది నా ఆలోచనల్లోకి కూడా రాదు. ► చిన్నప్పుడు మీరు మొసలిని ఇంటికి తీసుకెళ్లారట.. అసలేం జరిగింది? ఓ అదా.. నేను రోజూ చెరువులో స్నానం చేసేవాడిని. అక్కడ కనిపించిన ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకెళ్లా. దీంతో మా అమ్మ ‘తల్లీబిడ్డలను వేరుచేయడం తప్పు. దాన్ని మనం పెంచుకోకూడదు. వెళ్లి వదిలేసి రా’ అని చెప్పింది. ప్రకృతిని చూసి మనమెప్పుడూ భయపడకూడదు. అలా భయపడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► భారీ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే ఆందోళనను ఎలా ఎదుర్కొంటారు? నా సమస్య ఏంటంటే నేనెప్పుడూ అలాంటి భయాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి భయం గురించి ప్రజలకు చెప్పలేను. నా స్వభావం చాలా సానుకూలమైనది. నేను ప్రతీదాంట్లో మంచినే చూస్తా. అనుకున్నపని జరగకపోతే బాధపడను. ► మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి? నేను యువతకు చెప్పేదొకటే. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడొద్దు. జీవితాన్ని సంపూర్ణంగా చూస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం కిందపడ్డా బాధపడకూడదు. తిరిగి పైకిలేవడానికి అక్కడే దారి మొదలవుతుంది. అనంతరం మోదీ, గ్రిల్స్ కలిసి నదిని దాటారు. ప్రధానిని టార్పాలిన్‌తో చేసిన తెప్పలో ఎక్కించిన గ్రిల్స్ దాన్ని తోసుకుంటూ నదిని దాటారు. ఈ సందర్భంగా వర్షం కురవడంతో మోదీ, గ్రిల్స్ తడిసిపోయారు. దీంతో ఇద్దరూ కరివేపాకులు కలిపిన టీని తాగారు. ► ప్రకృతి పరిరక్షణ అంటే మీకు ఇష్టమా..? మేం ఇండియాలో ప్రతీ చెట్టును దేవుడిగా భావిస్తాం. ఇక్కడ ‘తులసీ వివాహం’ అని సంప్రదా యం ఉంది. ఇందులో భగవంతుడిని, తులసి మొక్కకు ఏడాదికోసారి పెళ్లి చేస్తాం. అలా తుల సీదళాన్ని మా కుటుంబంలో భాగం చేసుకుంటాం. భూమిని కాపాడుకోవడమన్నది మన బాధ్య త. మన సుఖం కోసం ప్రకృతిని దోచుకుంటున్నాం. ► స్వచ్ఛ భారత్ కోసం ఏం చేయాలంటారు? బయటివారి వల్ల స్వచ్ఛభారత్ సాధ్యం కాదు. భారత్‌లో ఉండేవారి స్వభావం వల్లే దేశం క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత అన్నది భారతీయ సంస్కృతిలోనే ఓ భాగం. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అలవర్చుకోవాలి. ఈ విషయంలో మహాత్మాగాంధీ చాలా కృషి చేశారు. ► చంపడం నా స్వభావానికి విరుద్ధం ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కత్తి, తాడు, కర్ర సాయంతో బల్లెం తయారుచేశారు. పులులు తాము వేటాడే జంతువును సమీపించేవరకూ నక్కి ఉండి ఒక్కసారిగా దాడిచేస్తాయని గ్రిల్స్ తెలిపారు. పులి సమీపిస్తే ఇలా దాడిచేయాలంటూ బల్లెం వాడే పద్ధతిని చూపించారు. దీంతో మోదీ స్పందిస్తూ..‘చంపడం నా స్వభావానికి విరుద్ధం. ఈ ఆయుధాన్ని మీరే తీసుకోండి’ అని చెప్పారు. దీంతో గ్రిల్స్ దాన్ని తీసుకోబోతుండగా..‘పర్లేదు. మీకోసం నేను దీన్ని తీసుకుంటా’ అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రిల్స్ స్పందిస్తూ..‘సార్ ఒకవేళ ఇప్పుడు పులి వస్తే మీరెంత వేగంగా పరిగెత్తగలరు?’ అని ప్రశ్నించారు. దీంతో మోదీ..‘మీరు చెప్పండి’ అని అడిగారు. దీంతో గ్రిల్స్ ‘నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను’ అని జవాబిచ్చారు. వెంటనే మోదీ ‘అవునా!’ అంటూ తేరిపారా చూశారు. మోదీ మాటకు గ్రిల్స్ స్పందిస్తూ..‘ఇది పేలని జోక్ సార్. నేను మిమ్మల్ని వదిలి వెళతానా?’ అంటూ వ్యాఖ్యానించారు. బేర్‌తో కలసి తెప్పపై నదిని దాటుతున్న ప్రధాని -
ఏ ప్రాణినీ చంపలేను: మోదీ
న్యూఢిల్లీ: డిస్కవరీ చానెల్లో సోమవారం ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించనుండటం తెలిసిందే. ఆ కార్యక్రమానికి సంబంధించిన మరో టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ కార్యక్రమం షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో తరచూ సాహసాలు చేస్తూ కనిపించే ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్ (బేర్ గ్రిల్స్).. తాజా వీడియో టీజర్లో పులి నుంచి కాపాడుకునేందుకు ఓ బల్లెంను మోదీకి ఇస్తారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నేను చిన్నప్పటి నుంచి పెరిగిన జీవన విధానం.. ఓ ప్రాణిని చంపడానికి నన్ను అనుమతించదు. కానీ మీరు బలవంతం చేస్తున్నందువల్ల నేను ఈ బల్లెంను పట్టుకుంటున్నాను’ అని చెప్తారు. ఇంకా మోదీ మాట్లాడుతూ ‘మనం ఈ ప్రదేశాన్ని ప్రమాదకరమైన ప్రాంతమని అనుకోకూడదు. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళితే అంతా ప్రమాదకరంగానే మారుతుంది. మనుషులు కూడా ప్రమాదకారులుగా మారారు. అయితే మనం ప్రకృతికి సహకరిస్తే, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది’ అని అంటారు. ఇండియాను శుభ్రంగా మార్చడంపై జరుగుతున్న కృషి గురించి గ్రిల్స్ అడగ్గా, ‘వేరెవరో బయటి నుంచి వచ్చి నా దేశాన్ని శుభ్రం చేయలేరు. భారతీయులే భారత దేశాన్ని శుభ్రం చేస్తారు. వ్యక్తిగత శుభ్రత భారతీయుల సంస్కృతిలోనే ఉంది. సామాజిక శుభ్రతను కూడా మేం అలవాటు చేసుకోవాల్సి ఉంది. దీనిపై మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారు. ఇప్పుడు మేం దీనిలో మంచి ఫలితాలను సాధిస్తున్నాం. సామాజిక శుభ్రత అంశంలో భారత్ త్వరలోనే విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను’ అని మోదీ ఈ వీడియోలో చెప్తారు. -
'మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్లో మోదీ
-
‘డిస్కవరీ’లో మోదీ
ముంబై: డిస్కవరీ టీవీ చానల్ ప్రసారం చేసే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రత్యేక ఎపిసోడ్లో నరేంద్ర మోదీ కనిపించనున్నారు. పర్యావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ డిస్కవరీ ఈ ఎపిసోడ్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో సాహసాలు చేస్తూ కనిపించే బేర్ గ్రిల్స్‌తో కలిసి మోదీ కూడా ప్రత్యేక ఎపిసోడ్లో నటించారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో జరిగింది. ఆగస్టు 12న 180 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దీనిపై మోదీ ఓ ప్రకటన చేస్తూ ‘చాలా సంవత్సరాలపాటు నేను ప్రకృతి ఒడిలో, పర్వతాల నడుమ, అడవుల్లో జీవించాను. ఆ అనుభవాలు నా జీవితంపై చెరగని ముద్ర వేశాయి. రాజకీయాలకు సంబంధం లేని, ప్రకృతితో ముడిపడిన ప్రత్యేక కార్యక్రమం కావడంతో ఇందులో నటించేందుకు నేను ఒప్పుకున్నాను’ అని తెలిపారు. భారత పర్యావరణ సంపదను ప్రపంచానికి చూపేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన, ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరాన్ని చాటిచెప్పేందుకు తనకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని మోదీ చెప్పారు. ఈ ఎపిసోడ్ టీజర్‌ను బేర్ గ్రిల్స్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, మోదీతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. రేపు కంచికి రానున్న ప్రధాని సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులోని కాంచీపురానికి రానున్నారు. 40 ఏళ్లకోసారి దర్శనమిచ్చే అత్తివరదరాజస్వాముల వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ నెల 1 నుంచి స్వామివారు శయనరూపంలో దర్శనమిస్తున్నారు. -
మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..
న్యూఢిల్లీ: బేర్ గ్రిల్స్.. డిస్కవరి ఛానెల్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్.. సోమవారం చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ‘180 దేశాలకు చెందిన ప్రజలు.. 2019, ఆగస్టు 12నాటి రాత్రి 9గంటలకు మోదీలోని మరో కోణాన్ని చూడబోతున్నారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు గ్రిల్స్. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్‌తో కలిసి అడవుల్లో సంచరిస్తూ.. నదులను దాటుతూ కనిపించారు. ఈ క్రమంలో గ్రిల్స్, మోదీని ఉద్దేశించి.. ‘భారత్‌కు చెందిన ముఖ్యమైన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. మిమ్మల్ని క్షేమంగా తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది’ అంటూ కామెంట్ చేయడం వినవచ్చు. People across 180 countries will get to see the unknown side of PM @narendramodi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi @DiscoveryIN on August 12 @ 9 pm. #PMModionDiscovery pic.twitter.com/MW2E6aMleE — Bear Grylls (@BearGrylls) July 29, 2019 ఈ వీడియోలో గ్రిల్స్ జంతువుల సంరక్షణ, పర్యావరణ మార్పుల వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో నరేంద్ర మోదీ షూటింగ్లో పాల్గొన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడాయన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్లో పాల్గొన్నారనే విషయం ప్రస్తుతం స్పష్టమైంది. ఈ షో గురించి ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు మరో సారి నరేంద్ర మోదీ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ‘పుల్వామాలో ఉగ్రవాదులు బరి తెగించి 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దేశం అంతా తీవ్ర విషాదంలో మునిగి ఉన్న సమయంలో మోదీ మాత్రం షూటింగ్లో పాల్గొన్నారు. దారుణం గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. జవాన్ల మృతి పట్ల మోదీకి ఎంత బాధ ఉందో ప్రోమోలో ఆయన నవ్వు చూస్తేనే అర్థం అవుతుంద’ని విపక్ష నేతలు మండి పడుతున్నారు. -
‘థాయ్ గుహ’పై డిస్కవరీలో డాక్యుమెంటరీ
న్యూఢిల్లీ: వరదనీటితో నిండిన థాయిలాండ్ గుహ నుంచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సాహసోపేతమైన ఘటనను డిస్కవరీ చానెల్ డాక్యుమెంటరీగా ప్రసారంచేయనుంది. 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను కాపాడేందుకు అంతర్జాతీయ డైవింగ్ నిపుణుల బృందాలు చేసిన అవిశ్రాంత కృషిని ఆద్యంతం ఆసక్తికరంగా డాక్యుమెంటరీలో చూపనున్నారు. డిస్కవరీ చానెళ్లలో ఈ డాక్యుమెంటరీ గంటపాటు ఈనెల 20 (శుక్రవారం)న రాత్రి 9గంటలకు ప్రసారంకానుంది. -
‘డిస్కవరీ జీత్’లో బాబా రామ్‌దేవ్ చరిత్ర
న్యూఢిల్లీ: యోగా గురువుగా ప్రఖ్యాతిగాంచిన బాబా రామ్‌దేవ్ జీవిత చరిత్రపై డిస్కవరీ జీత్ చానెల్ రూపొందించిన ‘ స్వామి రామ్‌దేవ్: ఏక్ సంఘర్‡్ష’ సిరీస్ ప్రసారాలు అదే చానెల్లో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 10న ఢిల్లీలో జరిగిన డిస్కవరీ జీత్ ప్రారంభోత్సవ వేడుకకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ఆచార్య బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌పై రూపొందించిన 60 నిమిషాల ప్రత్యేక వీడియోను ఆవిష్కరించారు. నిరుపేద రైతు రాంనివాస్ యాదవ్ కొడు కైన రామ్‌కిషన్(బాబా రామ్‌దేవ్ అసలు పేరు) 1965లో సొంతూరులో పడిన బాధల గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. చిన్ననాటి కష్టాలతోపాటు ఆరోగ్య సమస్యతో ఆచార్య బల్దేవ్ దగ్గర యోగా నేర్చుకుని అంచెలంచెలుగా బాబా రామ్దేవ్గా ఎదిగిన క్రమాన్ని ‘స్వామి రామ్‌దేవ్: ఏక్ సంఘర్‡్ష’ సిరీస్‌లో చూపించనున్నారు. -
అయ్యా పాల్.. ఏదో చెప్పి ఇంకేదో చేశావే..!
-
పాల్.. విమర్శలపాల్..
కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు తయారైంది అమెరికాకు చెందిన పాల్ రొసోలీ పరిస్థితి. ప్రపంచంలోనే అతి పెద్ద పాము అనకొండకు ఆహారమైపోతాను.. మనల్ని అది పూర్తిగా మింగేస్తే ఎలాగుంటుందో తెలుసుకుంటాను అంటూ పాల్ తన మాటలతో అందరిలోనూ ఆసక్తి రేపాడు. అనకొండ మింగినా.. తనకేమీ అవకుండా ఉండటానికి ఓ ప్రత్యేకమైన సూట్ తయారు చేయించానని.. దాని వల్ల తన ప్రాణాలకూ ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 7న ఈ ఎపిసోడ్ డిస్కవరీ చానల్లో ‘ఈటెన్ అలైవ్’ పేరిట వస్తుందని ప్రచారం చేశాడు. దీంతో కోట్లాది మంది ఈ కార్యక్రమం కోసం ఎదురుచూశారు. చూసిన తర్వాత.. పాల్‌పై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఇంతకీ ఆ షోలో ఏం చూపించారంటే.. - అమెజాన్ నదీ పరిసరాల్లో పాల్, అతని టీం అనకొండను వెతుకుతూ బయల్దేరారు. వారికి 20 అడుగుల పొడవున్న పచ్చ అనకొండ కనిపించింది. ప్రత్యేకమైన సూట్‌ను ధరించిన పాల్.. అనకొండ తనవైపు ఆకర్షితమయ్యేలా చేసేందుకు సూట్‌పై పంది రక్తాన్ని జల్లుకున్నాడు. నాలుగు కాళ్ల మీద నడుస్తున్నట్లుగా దాని ముందుకు వెళ్లాడు. అనకొండ వెంటనే అతడి తల భాగాన్ని నోటితో మింగడానికి ప్రయత్నించింది. శరీరాన్ని చుట్టేసింది. దీంతో పాల్‌కు తన చేతులు విరిగిపోతాయేమో అన్న భయం వేసింది. అతడి తల కొంచెం పాము నోట్లోకి వెళ్లిందో లేదో.. చేతులెత్తేశాడు. తనను రక్షించాలంటూ టీమ్‌కు సంకేతాలిచ్చాడు. దాంతో వారొచ్చి అనకొండ నోటి నుంచి ఇతడిని బయటకు లాగారు. - ఇది చూడటానికే ఈ కార్యక్రమానికి ఇంత ప్రచారమా అంటూ నెటిజన్లు డిస్కవరీ చానల్, పాల్‌పై అంతెత్తున లేచారు. తమ సమయమంతా వేస్ట్ చేశారని మండిపడ్డారు. పాల్ తన దేశ ప్రజలకు తలవంపులు తెచ్చాడని మరికొందరు వ్యాఖ్యానించారు. కొందరైతే.. తమ కుక్క నోట్లో వేలు పెట్టిన ఫొటోలు పోస్ట్ చేసి.. ‘డిస్కవరీ చానల్.. ఈటెన్ అలైవ్.. నా పేరిట కూడా షో ప్రసారం చేయరూ’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. అటు పాల్ మాత్రం అనకొండల సంరక్షణకు నిధుల సేకరణ నిమిత్తమే తానీ సాహసానికి పూనుకున్నానని.. ఈ దిశగా ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి కార్యక్రమాన్ని చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. -
పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు!
నవ్వింత: ఎప్పుడైనా సరే... పిల్లలు... పెద్దలు చెప్పే కథలు వింటూ పెరగాలనేది నా ఉద్దేశం. నా ధోరణి మా బుజ్జిగాడికి చాదస్తంగా అనిపించినా సరే... నేను మాత్రం వాడికి నిద్రపోయే ముందు ఏవో కథలు చెబుతూనే ఉంటా. అందులో భాగంగానే ఓ మహానుభావుడి గురించి చెబుతూ... ‘ఆయన చిన్నప్పుడు పాకుతూ పారాడుతూ ఎండలోకి వెళ్లి ఆడుకుంటూ ఉన్నాట్ట. అంతలో ఎండ వేడికి తట్టుకోలేక క్యారుక్యారుమని ఏడుస్తూ ఉండగా అటు వైపుగా వెళ్తున్న ఓ నాగుపాము తన పడగ పట్టి నీడనిచ్చిందట’ అని చెప్పా. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు - ‘భవిష్యత్తులో ఆ పిల్లాడు ఓ మహానుభావుడవుతాడు’ అంటూ నిర్ధారణ చేశారంటూ చెప్పా. ఈ మాట చెబుతూ ఉండగానే మా బుజ్జిగాడు వేయనే వేశాడు ఒక ప్రశ్న: ‘‘నాన్నా... నాగుపాము పడగపడితే వాళ్లు గొప్పాళ్లు అవుతారా?’’ అంటూ. ‘‘అవున్రా. ఎవరో మహర్జాతకులకు గానీ అలా జరగదు. మన కథల్లో అలా పాము పడగ నీడ పట్టినవాళ్లందరూ చాలా గొప్పవాళ్లయ్యారు’’ అన్నా. తీరిక దొరికినప్పుడల్లా నేనూ మా బుజ్జిగాడితో కలిసి టీవీ చూస్తుంటా. ఆ టైమ్‌లో వాడు చూసే కార్టూన్ ఛానెళ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇప్పించి ఏ యానిమల్ ప్లానెటో, ఏ డిస్కవరీ ఛానెలో కలిసి చూస్తుంటాం. ఇలాంటి షో చూస్తున్న ఓ క్షణాన మావాడు అడిగిన ఓ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ‘‘నాన్నా... ఈ పాముల్ని ఇలా చులాగ్గా పట్టేసే ఈ బ్రాడీబార్లూ, ఈ ఆస్టిన్ స్టీవెన్స్లూ... వాటిని ఇలా పట్టి కాసేపు వివరించి అలా వదిలేస్తుంటారు. మరికొందరైతే... విషానికి విరుగుడు తయారు చేసే కంపెనీలకు ఇచ్చేస్తుంటారు. మన బేర్‌గ్రిల్స్‌కు బుద్ధిలేదు నాన్నా... అతగాడైతే... ఎప్పుడెప్పుడు పాము కనిపిస్తుందా... ఎప్పుడెప్పుడు దాన్ని తినేద్దామా అని చూస్తుంటాడు. నాకో ఆలోచన వచ్చింది నాన్నా. ఇలా విషానికి విరుగుడు తయారు చేసే యాంటీవీనమ్ కంపెనీలు... కేవలం ఆ ఒక్క పనే కాకుండా మరో పని కూడా చేయవచ్చు కదా’’ అన్నాడు. ‘‘ఏంట్రా అదీ?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఏం లేదు... వాళ్లు రోజూ ఉదయం పూటా, సాయంత్రం పూటా కాసేపు నాగుపాముల్ని బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలకు పడగ పట్టిస్తే బాగుంటుంది. డబ్బులిచ్చి మోటారు సైకిల్ చక్రాలకు గాలి పట్టించుకున్నట్లుగానే... తమ పిల్లలందరూ భవిష్యత్తులో గొప్పవాళ్లైపోవాలనుకునేవారు పడగ నీడ పట్టించుకుంటారు కదా. అలా ఐదు నిమిషాలకు యాభై, పదినిమిషాలకు వందా రేటు పెట్టొచ్చు. ఏకంగా అరగంటసేపు పట్టించుకుంటే కొంత డిస్కౌంటు కూడా ఇవ్వచ్చు’’ అన్నాడు వాడు. ‘‘బానే ఉంది కానీ... ఈ ఉదయం, సాయంత్రం గొడవేమిట్రా? ఆ టైమ్‌లో ఎందుకు పట్టాలి పడగ?’’ అని అడిగా. ‘‘ఉదయం, సాయంత్రం ఎండ ఏటవాలుగా పడుతుంది కదా నాన్నా. పామును దూరంగా ఉంచే పడగ నీడ సరిగ్గా పాపాయి తల మీద పడేలా పామును అడ్జెస్ట్ చేయవచ్చు. దాంతో పిల్లాడూ సేఫ్... మన బిజినెస్సూ సేఫ్’’ అంటూ ఓ ఐడియా ఇచ్చాడు. వాడి ఆ ఆలోచనకే అద్దిరిపోతుండగా మరో ఐడియా కూడా ఇచ్చాడు. ‘‘నాన్నా... ఈ డిస్కవరీ ఛానెల్ వాళ్లతో కలిసి మాట్లాడి, మనం ఓ నక్కల కంపెనీ పెడదాం. అందులో కొన్ని నక్కల్ని మనం ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటామన్నమాట. ఈ ఐఐటీ పరీక్షలకూ, ఈ ఎంసెట్ ఎగ్జామ్స్కూ వెళ్లబోయే ముందు రోజు మనం ‘నక్క తోక తొక్కు... ఐఐటీ మెట్లు ఎక్కు’ అంటూ ఓ ఆఫర్ ఇస్తామన్నమాట. మరి ఇంతమంది తొక్కితే నక్క తోకకు గాయం అవుతుంది కదా. అందుకే నక్కను కేజ్‌లోనే ఉంచి తోక మాత్రమే బయట ఉండేలా చూస్తాం. కాకపోతే తోక సేఫ్‌గా ఉండేలా నేల మీద ఓ గ్రూవ్ తవ్విస్తాం. తోక ఆ గ్రూవ్లో ఉంటుంది. ఆ గ్రూవ్ మీద పాదం పెడితే నక్క తోక పైభాగం పాదానికి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా నక్క తోక తొక్కి వచ్చిన వాళ్లలో కొంతమందికి ఆ ఐఐటీలూ, ఈ ఎంసెట్లూ వచ్చినా... చుక్కా రామయ్య గారికంటే మనకే పేరు ఎక్కువొస్తుంది. ఎలావుంది నా ఐడియా?’’ అన్నాడు వాడు. భవిష్యత్తులో వాడు ఏ టాటానో, అంబానీయో అవుతాడేమో అనే ఆలోచనలో అవాక్కుడనై అచేతనావస్థలో ఉన్నా. ఇంతలో నాకూ ఓ ఆలోచన వచ్చింది. దాంతో వాణ్ణి ఓ ప్రశ్న అడిగా. ‘‘ఒరేయ్... మనమే ఈ బిజినెస్ పెడుతున్నప్పుడూ... కాసేపూ నీకూ పడగ పట్టిస్తే పోలా. భవిష్యత్తులో నువ్వూ గొప్పవాడివి కావచ్చు కదా’’ అన్నాను. ‘‘వద్దు నాన్నా... అప్పుడు నేను గొప్పవాడినైపోతే... మనం ఇలా బిజినెస్ చేయ్యలేం కదా. అప్పుడు మరింత మందిని గొప్పవాళ్లను చేసే ఛాన్స్ పోతుంది కదా. అందుకే దానికంటే ఇదే బెటర్’’ అన్నాడు వాడు. - యాసీన్ -
వినాశనాన్ని మళ్లీ చూస్తారా?!
టీవీక్షణం: వినాశనం అన్న మాట వింటే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎన్ని యేళ్లయినా మర్చిపోలేనంత దారుణమైన వినాశనాలు, ఉత్పాతాలు చాలానే సంభవించాయి ప్రపంచంలో. ప్రపంచాన్ని కంగారు పెట్టిన అలాంటి ఘోర దుర్ఘటనలు, వినాశనాలను చూపించే కార్యక్రమమే ‘డిస్ట్రాయిడ్ ఇన్ సెకెండ్స్’. క్షణాల్లోనే పెద్ద నష్టాన్ని కలిగించిన సంఘటనలను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది డిస్కవరీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం. చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గుండె దడదడలాడుతుంది. నిజానికి ఈ కార్యక్రమం వల్ల ఉపయోగమేమీ లేదు. ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది, అలా జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలి వంటి విషయాలేమీ మనకు చెప్పరు. కాబట్టి ఆసక్తి ఉంటే చూడొచ్చు. భయమేస్తే టీవీ కట్టేయొచ్చు. గుండె బలహీనంగా ఉండేవాళ్లు చూడకపోవడమే బెటర్. -
నవ్వింత: ఒక ఐడియా అడవినే మార్చేస్తుంది!
మా బుజ్జిగాణ్ణి ఎలాగైనా డాక్టరును చేయాలన్న పట్టుదల నాది. ఏయే స్పెషలిస్టు ఎలాంటి చికిత్సలు చేయడానికి పనికొస్తాడో వాడికి ఉగ్గుపాలతోనే చెప్పేస్తే... నిగ్గు తేలిపోయి అన్నింటా నిష్ణాతుడైపోతాడన్నది నా ఆశ. అందుకే బోల్డంత తెలివిగా, అతి చాకచక్యంగా వాడికి తెలియకుండానే బయాలజీలూ, జువాలజీలూ వాడి మెదడులోకి ఇంకిపోయేలా చేస్తున్నా. యానిమల్ ప్లానెట్లూ, డిస్కవరీ ఛానెళ్లూ వాడికి తెలియకుండానే విరివిగా చూపిస్తున్నా. నేను పన్నుతున్న ఈ కుట్రను చూసుకుని నా తెలివితేటలకు నేనే ముచ్చటపడిపోతున్నా. పైగా ఇప్పుడున్న రొటీన్ కోర్సులు కాకుండా మెడిసిన్‌లోనే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటే సరికొత్త కోర్సు ఏదైనా చేస్తే బాగుంటుందన్నది నా కోరిక. కానీ వాడు వైద్య, జంతు, వృక్ష ఇత్యాది పరిజ్ఞానాలు సంపాదించడం ఎలా ఉన్నా బోల్డన్ని సందేహాలతో నన్ను వేపుకు తినెయ్యడం పరిపాటిగా మారింది. ‘‘మొసలిని అర్జెంటుగా కంటి స్పెషలిస్టుకూ, పనిలో పనిగా సైకియాట్రిస్టుకూ చూపిస్తే మంచిది నాన్నా’’ అంటూ ఉన్నట్టుండి అన్నాడు. ‘‘ఎందుకురా?’’ అయోమయంగా అడిగా. ‘‘ఎందుకంటే... మొసలి కన్నీళ్ల గురించి నువ్వేగా చెప్పావు. అయినా అది కన్నీళ్లు కారుస్తూ నటిస్తోందని నువ్వెలా చెప్పగలవు? ఏమో... దానికీ నిజంగా ఏమైనా దుఃఖమూ, బాధా ఉన్నాయేమో? అసలలా మొసలికి ఏడుపెందుకు వస్తుందో తెలుసుకుంటే దానికి తెలియకుండానే లోపల బాధ ఏదైనా ఉంటే దాన్ని దూరం చేయవచ్చు కదా అని నా అభిప్రాయం’’ అన్నాడు. మొసలి కళ్ల మాట ఎలా ఉన్నా మొదట నా కళ్లు బైర్లుగమ్మాయి. ఆ తర్వాత మసకలు గమ్మాయి. వాడి కళ్లకు అతితెలివి పొరలు గమ్మినట్లుగా తోచించి నాకు. మరికొన్నాళ్లకే ఇంకో షాక్ తగిలింది నాకు. ‘‘మాంసాహారం తింటే ఒళ్లు కొవ్వెక్కుతుందనే అభిప్రాయం తప్పని అనిపిస్తోంది నాన్నా. మటన్‌తో ఫ్యాట్ పెరగడం కేవలం అపోహే.’’ ‘‘ఛ...ఛ... మటన్ తింటే శరీరంలో కొవ్వులు పేరుకుపోతాయని ఎన్నెన్నో పరిశోధనల్లో ప్రూవ్ అయిందిరా. అయినా నీకెందుకిలా అనిపిస్తోంది?’’ ‘‘ఎందుకంటే... ఏనుగు చూడు. ప్యూర్ వెజిటేరియన్. ఎప్పుడూ ఆకులూ అలములూ తింటూ ఉంటుంది. అడవి దున్నలు చూడు... గడ్డీ గాదం తప్ప మరేవీ ముట్టవు. ఇక ఖడ్గమృగాలంటావా... నెత్తిన కత్తి ఉండి కూడా దాంతో కత్తికో కండ కోయకుండా కేవలం గరికా పరిగా మేస్తాయి. పీచూ గీచూ తింటాయి. అయితే... శాకాహారం తినే ఆ జీవులే టన్నులకొద్దీ బరువు తూగుతాయి. కానీ... మాంసం తప్ప మరేదీ ముట్టని పులీ, సింహం, నక్కా, గిక్కా... బక్కగా ఉంటాయి. దీన్ని బట్టి తెలిసేదేమిటి? ఒబేసిటీ పెంచే పదార్థాలన్నీ వెజిటేరియన్ ఫుడ్డులోనే ఉన్నాయని అర్థం కావడం లేదూ? అందుకే నన్నడిగితే ఏనుగులన్నీ ఒకసారి ఏ ప్లాస్టిక్ సర్జన్‌నో కలిసి లైపోసక్షన్ చేయించుకుంటే మంచిది నాన్నా. లేదా ఏ బేరియాట్రిక్ సర్జన్‌నో కలిసి ఆకలి తగ్గే సర్జరీ చేయించుకున్నా బెటరే. అప్పుడవి కాస్త చురుగ్గా కదులుతూ, ఫాస్టుగా తిరుగుతూ ఆహారాన్ని ఇంకా చులాగ్గా, తేలిగ్గా సంపాదించుకోగలవు కదా. ఇక అడవులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న ఆ ఆహారమే అన్ని ఏనుగులకూ సరిపోయి వాటి సంఖ్యా పెరుగుతుంది. పైగా అవి జనావాసాల్లోకి వచ్చి అందర్నీ బాధపెట్టే దుర్ఘటనలూ తగ్గుతాయి. ఎలా ఉందీ ఐడియా. మన ఐడియా ఒక అడవినే మార్చేస్తుంది నాన్నా.’’ ‘‘ఒరేయ్.. నీ ఆలోచన సరికాదురా. మాంసం ఎక్కువగా తింటేనే ఒబేసిటీ వస్తుంది. నువ్వు చెప్పే ఎగ్జాంపుల్స్ కరెక్టే అనిపిస్తున్నా... కరెక్ట్ కాదని కూడా అనిపిస్తోందిరా!’’ ‘‘మరి ఆరోగ్య ప్రవచనాలు చేసేవారంతా వెజిటేరియన్ ఫుడ్ తినేవే ఆరోగ్యంగా ఉంటాయనీ, మాంసాహారం తినేవి అనారోగ్యంగా ఉంటాయనీ అడవి జంతువులను ఉదాహరణలుగా చూపించి ఉద్బోధలు చేస్తుంటారు కదా. అది కరెక్ట్ అయినప్పుడు ఇదీ కరెక్ట్ కావాలి కదా!’’ వాడికి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. మా బుజ్జిగాడి థాట్స్ అన్నీ ఆలోచనకు లాజిగ్గానే ఉన్నా ప్రాక్టికాలిటీకి మాత్రం ట్రాజిగ్గా అనిపించే సరికి కాస్త అయోమయానికి గురయ్యాన్నేను. ఏ స్పెషలిస్టులు ఏ చికిత్స చేస్తారన్నది చెప్పడం తాత్కాలికంగా ఆపేసి, వాణ్ణి పట్టుకుని అర్జెంటుగా సైకియాట్రిస్టును కలవక తప్పలేదు. మా వాడి ఆలోచన ధోరణినంతా సాలోచనగా విన్న ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ‘‘కంగ్రాట్స్ గురూ... మీ వాడు సరికొత్త కోర్సును వాడే సొంతంగా ఫామ్ చేసి, దాన్ని చదవేసి బీస్ట్ సైకియాట్రిస్టూ కమ్ యానిమల్ న్యూట్రిషనిస్టూ కాబోతున్నాడు. ఈ బీస్టియాట్రిస్ట్రీ అనే స్పెషాలిటికీ మృగయాట్రీషియనిస్టు అంటూ మనమే కొత్త పేరు కాయిన్ చేద్దామా? ఏమైతేనేం... నీ కోరిక తీరబోతోంది. ఇంకేం... బీ హ్యాపీ’’ అంటూ నా భుజం చరిచాడు. - యాసీన్