న్యూఢిల్లీ: యోగా గురువుగా ప్రఖ్యాతిగాంచిన బాబా రామ్‌దేవ్ జీవిత చరిత్రపై డిస్కవరీ జీత్ చానెల్ రూపొందించిన ‘ స్వామి రామ్‌దేవ్: ఏక్ సంఘర్‡్ష’ సిరీస్ ప్రసారాలు అదే చానెల్‌లో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 10న ఢిల్లీలో జరిగిన డిస్కవరీ జీత్ ప్రారంభోత్సవ వేడుకకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ఆచార్య బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రామ్‌దేవ్‌పై రూపొందించిన 60 నిమిషాల ప్రత్యేక వీడియోను ఆవిష్కరించారు. నిరుపేద రైతు రాంనివాస్ యాదవ్ కొడు కైన రామ్‌కిషన్(బాబా రామ్‌దేవ్ అసలు పేరు) 1965లో సొంతూరులో పడిన బాధల గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. చిన్ననాటి కష్టాలతోపాటు ఆరోగ్య సమస్యతో ఆచార్య బల్‌దేవ్ దగ్గర యోగా నేర్చుకుని అంచెలంచెలుగా బాబా రామ్‌దేవ్‌గా ఎదిగిన క్రమాన్ని ‘స్వామి రామ్‌దేవ్: ఏక్ సంఘర్‡్ష’ సిరీస్‌లో చూపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment