
ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సాహసయాత్రకు దిగాడు. అతనితో సమానంగా కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ సాహసాలకు పూనుకున్నాడు. అంతేకాక తను కళ్లజోడు ఎంత స్టైల్‌గా పెట్టుకుంటాడో చూపించాడు. అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా వీళ్లిద్దరూ నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఎంతో అనుభవజ్ఞుడైన బేర్ గ్రిల్స్ నీళ్లలో పడిపోగా సూపర్ స్టార్ మాత్రం ఎలాంటి అదురూబెదురూ లేకుండా దాన్ని అవలీలగా దాటేశాడు. ఇక డెబ్భైఏళ్ళ వయసులోనూ రజనీ అంత చురుకుగా, చలాకీగా పరుగెత్తుతూ కనిపించడం బేర్‌గ్రిల్స్‌నే ఆశ్చర్యపరిచింది. అతని శక్తియుక్తులను కళ్లారా చూశాక.. పొగడకుండా ఉండలేకపోయాడు. ‘యూ ఆర్ ఏ సూపర్ హీరో’ అని ప్రశంసించాడు. అంతేకాక ‘రజనీ.. అతనిపై విసిరిన ప్రతి చాలెంజ్‌ను స్వీకరించాడు’ అంటూ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ రెండో టీజర్‌ను బేర్ గ్రిల్స్ విడుదల చేశాడు. (రజనీకాంత్ వర్సెస్ బేర్ గ్రిల్స్)
ఈ అడ్వెంచర్ యాత్రకు సంబంధించిన షూటింగ్ కర్ణాటకలోని బండీపూర్ అభయారణ్యంలో జరుపుకోగా పూర్తి కార్యక్రమం డిస్కవరీ చానెల్‌లో మార్చి 28న ప్రసారం కానుంది. సాహస యాత్రలకు మారుపేరైన బేర్ గ్రిల్స్ గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో దీనికి సంబంధించిన షూటింగ్ జరగ్గా ఈ ఎపిసోడ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ బల్లెం తయారు చేయడమే కాక తెప్పపై ప్రయాణించి ఆకట్టుకున్నారు.
చదవండి: మోదీ వర్సెస్ వైల్డ్
Comments
Please login to add a commentAdd a comment