తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ సోషలిస్టు నాయకులలో ఒకరైన రాజ్యసభ ఎంపీ, ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైర్టెక్టర్ వీరేంద్ర కుమార్ గురువారం కన్నుమూశారు. గత రాత్రి 8.30 గంటలకు కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన మరణించారు. వీరేంద్రకుమార్‌కు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈయన రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో, మీడియా రంగంలో, సాహితీ ప్రపంచంలో ఇలా ప్రతీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. చదవండి: తబ్లీగ్ జమాత్ చీఫ్‌పై సీబీఐ దర్యాప్తు
లోక్‌సభ సభ్యునిగా కోజికోడ్ నుంచి రెండుసార్లు గెలిచిన వీరేంద్రకుమార్ కేంద్ర, రాష్ట్రాల్లో రెండింటిలోనూ మంత్రిగా పనిచేశారు. 2010లో తన ప్రయాణ కథనం హైమావత భోవిల్‌కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు తన సాహితీ రచనలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, 100కి పైగా అవార్డులను గెలుచుకున్నారు.
కాగా ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'పేదలకు, నిరుపేదల పక్షాన గొంతెత్తారని గుర్తుచేశారు. సమర్థవంతమైన శాసనసభ్యుడిగా, ఎంపీగా ఆయన మంచి గుర్తింపు పొందారంటూ' మోడీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కూడా వీరేంద్ర కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు. చదవండి: పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే
Comments
Please login to add a commentAdd a comment