బీజేపీ మెనిఫెస్టోలో రామాలయం, 370 ఆర్టికల్!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణం, జమ్మూ,కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న 370 ఆర్టికల్ లాంటి అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆర్ధికాభివృద్ది, అభివృధ్ది అంశాలకు మెనిఫెస్టోలో పెద్ద పీట వేశారు. రామాలయం, 370 ఆర్టికల్ గురించి మెనిఫెస్టో చివరిపేజిలో రెండు లైన్లు రాశారు. రాజ్యాంగ పరిధిలో రామాలయ నిర్మాణానికి ఓ ఫ్రేమ్ వర్క్ రూపొందించడానికి సాధ్యసాధ్యాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
హిందుత్వ అంశం ఎన్నికల ఎజెండా కాదని, హిందుత్వ అంశాన్ని ఎన్నికల్లో వాడుకోబోమని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అన్నారు. హిందుత్వ అంశం కేవలం సాంస్కృతికపరమైన అంశమే అని అన్నారు. కాశ్మీర్ లోయకు కాశ్మీరి పండితులను వెనక్కి పంపడానికి చర్యలు తీసుకుంటామని జోషి తెలిపారు.