నాగ్‌పూర్/హరిద్వార్: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీలు).. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నాగపూర్‌లో సోమవారం జరిగిన అఖిల భారతీయ సహసంపర్క్ ప్రముఖ్ కార్యక్రమంలో మందిర నిర్మాణంతో పాటు, కశ్మీర్‌లో 370 అధికరణం రద్దు చేయాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది.
హరిద్వార్‌లో వీహెచ్‌పీ నిర్వహించిన కేంద్రీయ మార్గదర్శక్ మండల్ భేటీలో అయోధ్యలో మందిర నిర్మాణ అంశాన్ని ప్రభుత్వం దగ్గరకు తీసుకువెళ్లేందుకు సాధుసంతులతో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా, అధ్యక్షుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.
రామమందిరాన్ని నిర్మించండి: ఆరెస్సెస్
Published Tue, May 26 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement