
ఆ శక్తి కేసీఆర్ కు ఉంది:రమణ్ సింగ్
రాయ్ పూర్: తెలంగాణ రాష్ట్రంతో బలమైన సంబంధాన్ని కోరుకుంటున్నామని చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని సమస్యలుంటాయో తమకు తెలుసుని రమణ్ సింగ్ తెలిపారు. ఆ సమస్యలను అధిగమించే శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. కరెంట్ సరఫరా కోసం విద్యుత్ సరఫరా లైన్లను త్వరగా నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు రమణ్ సింగ్ స్సష్టం చేశారు.
తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. రాయ్పూర్లో జరిగిన ఎంఓయూ సమావేశానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.