తెలంగాణ కోరితే 300 మెగావాట్లు ఇస్తాం: బాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరితే 300 మెగావాట్ల విద్యుత్ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి అంశంపై తెలంగాణ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం టీడీపీని దెబ్బతీయాలని చూస్తోంది. ప్రతి దానికీ విమర్శలు చేస్తోంది. అయినా నేను దేనికీ భయపడను. ప్రజలకు పోటీపడి సేవలందిద్దామని చెప్పా. చర్చకు కూడా సిద్ధమన్నా. ఇవేమీ పట్టించుకోకుండా టీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇది సరికాదు’ అని మంగళవారం గన్నవరంలో ఆయన ధ్వజమెత్తారు.