బ్యాంక్ బ్యాలెన్స్ యాప్తో జర భద్రం!
''మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి'' అనే యాప్ ప్రకటన చూసి డౌన్ లోడ్ చేసుకున్నారో.. అంతే సంగతులు! మీ అకౌంట్లోని డబ్బంతా మాయమవ్వకపోతే ఒట్టు! ఎందుకంటే అది పక్కా మోసపూరిత యాప్. ప్రస్తుతం వాట్సప్లో చక్కర్లు కొడుతున్న ఈ యాప్పై రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది.
బ్యాంక్ బ్యాలెన్స్ తెలసుకునేందుకు ప్రత్యేకంగా తాము ఎలాంటి యాప్ను రూపొందించలేదని, కొందరు హ్యాకర్లు ఆర్బీఐ లోగోను అక్రమంగా వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి స్పందించొద్దని బ్యాంకు ఖాతాదారుల్ని కోరింది.