'ఆ నిర్ణయానికి స్వాగతం'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పరిపాలనను మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం రెబల్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ బహుగుణ స్వాగతించారు. ఇదొక మంచి ముందడుగని అన్నారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై స్పందిస్తూ హరీశ్ రావత్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినందున ఆయనను తొలగించాల్సిందేనని చెప్పారు.
అయితే, రాష్ట్రపతి పాలన ఎంతో కాలం సాగదని, త్వరలోనే మరోసారి ఎన్నికలు జరుగుతాయని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ సమయంలోనే ప్రభుత్వ ఏర్పాటు జరిగితే బాగుండేదని అన్నారు.