పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి | Right wing activists vandalise Pakistan Airlines office in Delhi | Sakshi
Sakshi News home page

పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి

Published Thu, Jan 14 2016 5:46 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి - Sakshi

పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఎయిర్ లైన్స్(పీఐఏ) కార్యాలయంపై గురువారం దాడి జరిగింది. బారాఖాంభా రోడ్డులో ఉన్న పీఐఏ కార్యాలయంలో హిందూ సేన కార్యాకర్తలు విధ్వంసానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో కార్యాలయంలోకి చొరబడిన దుండగులు సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. తర్వాత కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

కస్టమర్స్ లా నటించి పీఐఏ కార్యాలయంలోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు విధ్వంసానికి దిగారని డీసీపీ జతిన్ నార్వాల్ తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పారు. పఠాన్ కోట్ లో భారత వైమానిక స్థావరంపై ఈ నెల 2న పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణపై సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ లైన్స్ పై హిందూ సేన దాడికి దిగడం కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement