రైల్లో రిస్కీ స్టంట్‌, క్షణాల్లో.. | Risky stunt by youth at Train door killed | Sakshi
Sakshi News home page

రైల్లో రిస్కీ స్టంట్‌, క్షణాల్లో..

Dec 30 2019 12:04 PM | Updated on Dec 30 2019 12:26 PM

Risky stunt by youth at Train door killed - Sakshi

సాక్షి, ముంబై : క్షణాల్లో ప్రాణాలు పోతున్నా కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. తాజాగా ప్రమాదమని తెలిసి కూడా డేంజరస్‌ ఫీట్‌ చేసి  ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు డోర్‌ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్‌ చేశాడో యువకుడు. ఈ ఫీట్‌ వికటించి అదుపు తప్పి ప్లాట్‌ఫాం మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు.  దీన్ని అతని స్నేహితులు వీడియో తీసారు. స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సబంధించిన వీడియోను ట్వీట్‌ చేసింది. డిసెంబర్ 26న ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో దిల్షాన్ అనే యువకుడు మరణించాడని పేర్కొంది. రైలులో ఇలాంటి స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయని ప్రయాణికులను వారించింది.భద్రతను పట్టించుకోకుండా, కదిలే రైలు ఎక్కడం, కదిలే రైలులోఅనాలోచిత ప్రయోగాలు లాంటివి చేయొద్దని సూచించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement