హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రిటైర్డ్ జస్టిస్ ఏకే రూపన్వాల్ కమిషన్ తన నివేదికను యూజీసీకి సమర్పించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రిటైర్డ్ జస్టిస్ ఏకే రూపన్వాల్ కమిషన్ తన నివేదికను యూజీసీకి సమర్పించినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రకాష్ జవదేకర్, నివేదిక ఇంకా తన వద్దకైతే రాలేదని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఈ కమిటీని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనాన్ని రేపింది. అన్ని పార్టీలూ మూకుమ్మడిగా ఎన్డీఏ ప్రభుత్వంపై దాడి చేశాయి.