
కేకు కోసి.. బక్రీద్ చేశారు!
సాధారణంగా ఎవరైనా నాయకుల పుట్టినరోజుకో, లేదా కొత్త సంవత్సరం సందర్భంగానో బహిరంగంగా కేకులు కట్ చేస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మాత్రం సరికొత్తగా బక్రీద్ సందర్భంగా కేక్ కట్ చేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లోని ముస్లిం విభాగం నేతలు కూడా బక్రీద్ జరుపుకోవాలని అనుకున్నారు. కానీ, జంతు వధకు వారు వ్యతిరేకం కావడంతో ఒక కేకు మీద 'నో బక్రా గోట్ 2016' అని రాయించి.. దాన్ని కోసి.. బక్రీద్‌ను ఘనంగా జరుపుకొన్నారు.