త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా | sania mirza to take up broom soon | Sakshi
Sakshi News home page

త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా

Published Thu, Oct 9 2014 7:57 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా - Sakshi

త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా  త్వరలో చీపురు పట్టనుంది. స్వచ్ఛ భారత్లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ ఆహ్వానాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ అనీల్ అంబానీ చాలెంజ్ను స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్కు వెళ్లేలోపే స్వచ్ఛ భారత్లో పాల్గొంటానని తెలిపింది.

కాగా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున "స్వచ్ఛ భారత్'ను ప్రారంభిస్తూ.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో  అనిల్ అంబానీ కూడా ఉన్నారు. మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. వారిలో సానియాతో పాటు టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement