జమ్ముకశ్మీర్ దివంగత ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనాన్ని ఆయన కుటుంబీకులు, బంధువులు ఖాళీచేశారు. ఇటీవల సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ చనిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు గురువారం తెలిపాయి.
సయీద్ మరణం తర్వాత ఆయన కుటుంబసభ్యులు జమ్మూ, శ్రీనగర్‌లలోని సీఎం నివాసాల్లో ఉండట్లేదు. కానీ విలువైన వస్తువులు, ఇతర సామగ్రిని తీసుకున్నారు. అనంతరం అధికారికంగా ఆ భవనాన్ని పూర్తిగా రాష్ట్ర ఎస్టేట్స్ విభాగానికి స్వాధీనం చేశారు.
జనవరి 7న ముఫ్తీ సయీద్ మరణం, అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహరాలో అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఆయన భార్య గుల్షన్ అరా, కుమారుడు తసాదక్ ముప్తీ, కుమార్తె మెహబూబా ముఫ్తీ శ్రీనగర్‌లోని అత్యంత భద్రత ఉండే మరో భవనంలోకి మారిన సంగతి తెలిసిందే.