యూఏపీఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు | SC Notice To Centre On Anti Terror UAPA Law | Sakshi
Sakshi News home page

యూఏపీఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Sep 6 2019 11:52 AM | Updated on Sep 6 2019 11:54 AM

SC Notice To Centre On Anti Terror UAPA Law - Sakshi

యూఏపీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం (యూఏపీఏ) 2019ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రజలు తమ అసంతృప్తిని వెళ్లగక్కే హక్కును నిరోధించే యూఏపీఏను రాజ్యాంగవ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పేర్కొన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఈ చట్టం నిరోధిస్తుందని, టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తి అరెస్ట్‌ కాకుండా తనను తాను సమర్ధించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం లేదని పిటిషనర్‌ సజల్‌ అవస్ధి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement