
చంఢీగఢ్ : పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాఠశాల టాయిలెట్‌లో శానిటరీ ప్యాడ్స్ పడేశారని బాలికల దుస్తులు విప్పి తనిఖీ చేశారు. పంజాబ్‌లోని ఫిజికా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్‌లో ఓ శానిటరీ న్యాప్‌కిన్ కనిపించడంతో దానిని ఎవరు ధరించారో అని చెప్పాలని ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించారు. బాలికలను వరుసగా నిలబెట్టి తనిఖీలు చేశారు.
ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు ఇలాంటి విషయాల్లో పిల్లలని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఇలా చేయడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కాగా ఈ ఘటనపై దుమారం రేగడంతో ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు టీచర్లను బదిలీ చేసింది. మరో టీచర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సోమవారం నాటికి దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment