
'ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేయండి'
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.
ఎమ్మెల్యేతో బేరసారాల్లో స్వయంగా ముఖ్యమంత్రే భాగస్వామ్యంకావడంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సీతారాం కోరారు. ఇలాంటి తప్పు మరొకటి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడినప్పటి ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి.