seetharam yechuri
-
Telangana: ప్రజాపోరు షురూ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే ఇప్పుడు నిజమైన దేశభక్తి అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్య్రోద్యమంతో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని, అందులో భాగంగా ప్రజాపోరాటం ప్రారంభమైందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం ఇందిరాపార్కు వద్ద ‘ప్రతిపక్షాల మహాధర్నా’ జరిగింది. ఏచూరి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘దేశంలో మోదీ పాలన ఇలాగే సాగితే ప్రజాస్వామిక హక్కులు మిగలవు. ప్రైవేటీకరణ పేరుతో మోదీ దేశాన్ని తెగనమ్ముతున్నారు. ఆయన విధానాలను వ్యతిరేకించి ప్రశ్నించే నాయకులను ఈడీ, సీబీఐ దాడులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు కష్టాల్లో ఉంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధిపతులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముందు దేశాన్ని కాపాడుకున్న తర్వాత ఈ దేశాన్ని మార్చుకుందాం. అందుకే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యమానికి నడుం బిగించాయి. మోదీ పాలనపై పోరాడి దేశాన్ని కాపాడుకోవడమే దేశ ప్రజల వాగ్దానం, సంకల్పం కావాలి..’ అని ఏచూరి విజ్ఞప్తి చేశారు. ‘కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆదాయపు పన్ను పరిధిలోనికి రాని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా గోదాముల్లో మూలుగుతున్న ధాన్యాన్ని పేదలకు పంపిణీ చేయాలి..’ అని డిమాండ్ చేశారు. గులాబీ చీడ వదలాలంటే మోదీని బండకేసి కొట్టాలి: రేవంత్ ‘తెలంగాణకు విముక్తి కలగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి. ఈ చీడ వదలాలంటే కేసీఆర్‌కు అండగా ఉన్న మోదీని బండకేసి కొట్టాలి. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుంటే మోదీ, అమిత్‌షాలు ఈ దుర్మార్గుడిని అక్కున చేర్చుకుని తెలంగాణ ప్రజలను గుండెలపై తన్నిస్తున్నారు. గల్లీలో ఉన్న కేడీ, ఢిల్లీలో ఉన్న మోదీ ఒకే తాను ముక్కలు. మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరల రూపంలో రూ.24 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కష్టించి సమకూర్చిన దేశ సంపదను మోదీ తెగనమ్ముతున్నారు. రాష్ట్రంలో నిజాం నవాబు ద్వారా సంక్రమించిన వేలకోట్ల రూపాయల విలువైన భూములను సీఎం కేసీఆర్ తెగనమ్ముతున్నారు. ఆయన శివలింగం మీద తేలులా మిగిలాడు. ఆ తేలును ఎలా తీయాలో, చెప్పు కింద ఎలా తొక్కాలో మాకు తెలుసు..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే భారత్‌బంద్‌ను, అక్టోబర్ 5న జరిగే రాస్తారోకోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో అసలైన డెకాయిట్లు: నారాయణ ‘టీఆర్ఎస్లో అసలైన డెకాయిట్లు ఉన్నారు. రేవంత్ ఇంటిపై దాడి లాంటి ఘటనలు పునరావృతమైతే సంగతి చూస్తాం’ అని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ అన్నారు. మోదీ నరహంతకుడు, ప్రజా భక్షకుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అక్టోబర్ 5న జరిగే పోడు పోరాటంలో బాధిత ప్రజలు క్రియాశీలకంగా పాల్గొనాలని, వారి కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరకు సుధాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ కార్యదర్శి పోటు రంగారావు, గోవర్ధన్, లిబరేషన్ కార్యదర్శి రాజేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కాంగ్రెస్ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డిలతో పాటు ప్రజా సంఘాల నేతలు, ఆయా పార్టీల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి మూలాలైన నాలుగు స్తంభాలను ధ్వంసం చేస్తున్నారు. లౌకిక భారతదేశం, సామాజిక స్వేచ్ఛ, సమాఖ్య స్ఫూర్తి, ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీ ఈ దేశాన్ని నిరంకుశం వైపు నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో రాజ్యాంగం ఉనికి ప్రమాదంలో పడుతుంది. – సీతారాం ఏచూరి తెలంగాణలో ఆఖరి పోరాటం ప్రారంభమైంది. 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళం వినిపించింది. మలిదశ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది. ఈ ఆఖరి పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన సాకారం కావాలి. –రేవంత్ రేవంత్ ఇంటిపై దాడి నీచ సంస్కృతి. కేసీఆరో, కేటీఆరో వస్తే మేము రేవంత్‌ను పంపుతాం. అప్పుడు మల్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకదెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో క్షేత్రస్థాయిలో ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా మోదీ, కేసీఆర్‌లను దెబ్బకొట్టాలి. – నారాయణ -
ఉక్కు పోరాటం
-
ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈశాన్య ఢిల్లీ అలర్ల కేసు విచారణను ఢిల్లీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. సీఏఏ-ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 53 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలతో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లకు ప్రేరేపించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిలో భాగంగానే ప్రధాన ఆరోపనలు ఎదుర్కొంటున్న జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థిసంఘం మాజీ నాయకుడు. యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను ఆదివారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. తన కుమారుడిని అక్రమ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారని ఖలీద్ తండ్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు ఆయన అరెస్ట్‌ను నిర్ధారిస్తూ ఢిల్లీ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసకు బాధ్యులుగా భావిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. (చార్జిషీట్లో పలువురు ప్రముఖులు) మరోవైపు ఈ అల్లర్లలో పలువురు భాగస్వామ్యూలను చేస్తూ ఢిల్లీ పోలీసులు ఇటీవల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ కూడా ఉన్నారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్) అయితే దేశ వ్యతిరేక కుట్ర పేరుతో ఏచూరిని కూడా ఆజాబితాలో చేర్చడంపై దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరులేదని తెలిపినట్లు సమాచారం. అయితే మిగతా వారిని కూడా విచారణ నిమిత్తం ముందుగానే నోటీసులు జారీచేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అరెస్ట్‌ల ప్రక్రియను ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కేంద్రం నిర్ణయం ప్రమాదకరం
న్యూఢిల్లీ/పుణే: రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిల్వలను ప్రభుత్వానికి ఆర్బీఐ బదిలీ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్థిక విపత్తును ఎదుర్కోవడం చేతకాకనే, ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తుపాకీ గాయానికి ఆస్పత్రి నుంచి బ్యాండ్‌ఎయిడ్‌ను ఎత్తుకుపోవడం ఇలాంటిదేనని వ్యాఖ్యానించారు. ‘ప్రధాని, ఆర్థిక మంత్రి వారు సృష్టించిన ఆర్థిక విపత్తును పరిష్కరించడం చేతకాక ఆర్బీఐ డబ్బును దోచుకుంటున్నారు. తుపాకీ బుల్లెట్ గాయం మాన్పటానికి ఆస్పత్రి నుంచి బ్యాండ్ ఎయిడ్ దొంగిలించడం వంటిదే ఇది. ప్రభుత్వ చర్య ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు ఎంతమాత్రం సాయపడదు’అని ‘ఆర్బీఐ లూటెడ్ ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఆర్బీఐ మిగులు నిధులను వాడుకోవాలన్న ప్రభుత్వం నిర్ణయం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ చర్య ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను దివాళా దిశగా, ఆర్థిక అత్యవసర పరిస్థితివైపు ప్రభుత్వం తీసుకెళుతోందన్నారు. ప్రభుత్వ చర్య ఆర్థిక అప్రమత్తతా లేక ఆర్థిక బలిదానమా అని కాంగ్రెస్ మరో ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. బడ్జెట్ గణాంకాల్లో కనిపించకుండా పోయిన రూ.1.76 లక్షల కోట్లకు సంబంధించిన లెక్క ఆర్బీఐ నుంచి తీసుకున్నదేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ట్విట్టర్లో.. ‘ఆర్బీఐ అంటే రాబ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న పనే ఇది: ఏచూరి ప్రభుత్వానికి ఆర్బీఐ నగదు బదిలీ చేయడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్బీఐ లాభాల్లో 99 శాతం వరకు ప్రభుత్వమే లాగేసుకునే తంతు 2014 నుంచి నడుస్తోందని ఆరోపించారు. ఆఖరి అవకాశంగా మాత్రమే ఆర్బీఐను వాడుకోవాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రంఇష్టారాజ్యంగా నిధులను మళ్లించటాన్ని ఆయన తప్పుపట్టారు. మోదీ స్నేహితులు లూటీ చేసిన బ్యాంకులకు అందించేందుకే రూ.1.76 లక్షల కోట్లను ప్రభుత్వం వినియోగించనుంది. ప్రజల జీవితాలతోపాటు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం సాగిస్తున్న ‘కనికరం లేని దాడి’ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆయన ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, ప్రభుత్వరంగ ‘నవరత్నాలు’ఇందుకు జత కలిశాయని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వాస్తవాలు తెలుసుకో : నిర్మలా ఆర్బీఐ నిధులను ప్రభుత్వం దొంగిలిస్తోందన్న రాహుల్ విమర్శలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇటువంటి విమర్శలను తాను పట్టించుకోబోనని, ఆరోపణలు చేసే ముందు రాహుల్ తమ పార్టీ ఆర్థిక మంత్రులు, సీనియర్ నేతలతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పుణేలో జరిగిన జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మిగులు నిధులను ఏం చేయాలనే దానిపై సొంతంగా బిమల్ జలాన్ నేతృత్వంలో కమిటీని ఆర్బీఐనే ఏర్పాటు చేసుకుందన్నారు. పలువురు ప్రముఖ నిపుణులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కాగా, ఆర్బీఐ నుంచి వచ్చిన మిగులు నిధులను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. -
‘బాబర్, ఔరంగజేబుగా పేరు మార్చుకో’
సాక్షి, ముంబై: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన పేరు మార్చుకుంటే మంచిదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూచించారు. రామాయణ, మహాభారతాలు మొత్తం హింసతో నిండి ఉన్నాయని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ ధర్మపై నమ్మకం లేనప్పుడు ఆయనకు సీతారాం అనే పేరేందుకని .. బాబర్, చెంగిఛ్‌ఖాన్, ఔరంగజేబుగా పేరు మార్చుకుంటే బాగుంటుందని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు. రాముడిపై నమ్మకం లేని వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులని సంజయ్ వ్యాఖ్యానించారు. ‘హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? రామాయణం, మహాభారతాలు ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి. ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుస్తుందనేదే దాని సందేశం. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంతా సత్యానికి సంకేతాలు. రామాయణ, మహాభారతాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు.. రేపు పాకిస్తాన్ మీద భారత సైనికుల పోరాటం కూడా హింసాత్మకం అంటారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను ఎదుర్కోవడం కూడా హింసేనా?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. హిందువులను ఎటాక్ చేయడమే ఆయన విధానమని.. ఆ విధంగా తనను తాను సెక్యులర్‌గా గుర్తింపు పొందాలని తాపత్రయం పడుతున్నారని సంజయ్ అన్నారు. ఇదిలావుండగా ఏచూరి వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ.. యోగా గురువు రామ్‌దేవ్ బాబా హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏచూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోపాలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సీతారం ఏచూరి పలు వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రామాయణ ,మహభారతం లు రెండు కూడ యుద్దాలతోపాటు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయని అన్నారు. హిందు ప్రచార వాదులు చెబుతున్నట్టుగా హిందువులు హింసను ప్రోత్సహించే వారు కాదని చెప్పగలరా అని ఏచూరి ప్రశ్నించారు. మరోవైపు హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని పోటిలోకి దింపిందని ఏచూరి ఆరోపించారు. -
ప్యాకేజీకి జైకొట్టింది టీడీపీనే
సాక్షి, అమరావతి : ‘టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగింది. అవకాశవాదాన్ని ప్రదర్శించింది. ఆ సమయంలో వాళ్లు ఏమి చెప్పినా తలూపింది. ప్యాకేజీకీ జై కొట్టింది. వెంకయ్య, జైట్లీకి సన్మానాలు చేసింది చంద్రబాబే. నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా అని ఆయన పోరాటం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి వైఎస్సార్సీపీ కలిసివచ్చింది. రాజకీయంగా మాతో కలిసి వచ్చేందుకు ఒక పార్టీ ముందుకొచ్చింది. అతడు సినిమా వ్యక్తి అనో, మరొకరనో మేం చూడలేదు. మేం చెబుతున్న నూతన ప్రత్యామ్నాయానికి మద్దతిస్తామన్నాడు. కలిసి పోరాటాలు చేద్దామన్నాడు. అందుకే సీట్ల సర్దుబాటు చేసుకున్నాం’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఏపీలో చంద్రబాబు పాలన ఎలా ఉందో నా కన్నా మీకే (మీడియాకు) బాగా తెలుసు. మా రాష్ట్ర పార్టీ వాళ్లను అడిగితే బాగా చెబుతారు. ఆయన పాలన ఎలా ఉందో చూస్తున్నారుగా మీరంతా? ఇక్కడ భూ సేకరణ బిల్లుకు సంబంధించి ఒక మాట చెప్పాలి. గతంలో ఆ బిల్లును అనేక తర్జనభర్జనలు పడి ఆమోదించాం. దాన్ని తోసిరాజని కొందరు సవరణలు తెచ్చారు. ఇందుకు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను చూపుతున్నారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందనే పేరిట కేంద్రం, రాష్ట్ర పరిధి అంశమనే పేరిట కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు తెచ్చాయి. ఈ వైరుధ్యాలను పరిష్కరించాల్సి ఉంది. భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇవన్నీ రాష్ట్రపతి వద్ద ఉన్నాయి. కేంద్ర చట్టానికి ఆధిపత్యం ఉండాలనేది మా అభిప్రాయం. రాష్ట్ర చట్టాలన్నీ దానికి లోబడి ఉండాలి. దీని కోసం అవసరమైతే ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఇందుకు మేం చొరవ తీసుకుంటాం. ఎన్నికల తర్వాతే మా ఎత్తులు పొత్తులు ఇక్కడో పార్టీతో అక్కడో పార్టీతో కేంద్రంలో మరో పార్టీతో పొత్తా అని చాలామంది అమాయకంగానో, అతి తెలివితోనో మాట్లాడుతున్నారు. అది నిజం కాదు. ఇది గత 35 ఏళ్లుగా జరుగుతున్నదే. ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలకు జనాదరణ ఉంది. ఆ పార్టీలకు ఆయా రాష్ట్రాలలో తప్ప మరెక్కడా బలం ఉండదు. ఎన్నికలకు ముందే పొత్తులు, అవగాహనలు ఎందుకుండవంటే ఎక్కువగా ఉన్నవి ప్రాంతీయ పార్టీలే. తెలుగు దేశం, వైఎస్సార్సీపీలనే తీసుకోండి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలలోనే కదా. ఇలాగే మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా. ఈ వేళ మన దేశంలో ఇది అనివార్యం. అందువల్ల రాష్ట్రాల స్థాయిల్లోనే కూటములు, లేదా సర్దుబాట్లు జరుగుతుంటాయి. ఎన్నికల తర్వాతే ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. ముందే ఫలానా అభ్యర్థి ప్రధాని అని చెప్పలేం. 1977లో ఇందిరా గాంధీని ఓడించిన తర్వాతే కదా జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. 1996లో దేవెగౌడ ప్రధాని కావడమైనా, 1998లో వాజపేయి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటైనా, 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వమైనా ఎన్నికల తర్వాతే కొలువుదీరిన విషయాన్ని మరువొద్దు. ఈసారీ అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు తప్పదు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది. 2004లో యూపీఏ ప్రభుత్వాన్ని మేం బయట నుంచి బలపర్చాం. ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనే దాన్నిబట్టి ఉంటుంది. ప్రాంతీయ స్థాయిలో పోటీలు వేరు. జాతీయ స్థాయి రాజకీయాలు వేరు. ఉదాహరణకు 2004లో మేం (సీపీఎం) కేరళలో కాంగ్రెస్‌తో పోటీ పడ్డాం. జాతీయ స్థాయిలో అదే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చాం. ప్రత్యామ్నాయ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే వామపక్షాల బలం ఎక్కువగా ఉండాలని కేరళ ప్రజలు భావించారు. ఎక్కువ సీట్లిచ్చారు. ఏ సమయంలో ఏది అవసరమో అది చేస్తాం. 1977లో ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. అప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని భావించాం. ఎవరైతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడతారో వారికి మద్దతిచ్చాం. ఆ రోజుల్లో బీజేపీ లేదు. జనతా పార్టీ ఉంది. వాళ్లు పోరాటాలు చేశారు. మేమూ చేశాం. కానీ ఎవరం పొత్తు పెట్టుకోలేదు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా మేం బంద్‌కు పిలుపిచ్చాం. వాళ్లూ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడింది. దీన్ని కాపాడేందుకు ఎవరు కలిసి వస్తారో వాళ్లతో వెళతాం. కలిసొచ్చే వాళ్లలో కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా సమన్వయంతో కదులుతాం. ఈ ఎన్నికల్లో మా ప్రధాన అజెండా... బీజేపీ ప్రభుత్వాన్ని దించడం ప్రధానం. లేకుంటే ఆర్ఎస్ఎస్ పట్టు మరింత పెరుగుతుంది. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుంది. రెండోది ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడం. దేశ సమైక్యత, సమగ్రత కాపాడడం. వామపక్షాల బలం పెంచడం. మూడోది ఈ ఎన్నికల తర్వాత లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. పార్టీ తిరోగమనంలో ఉన్నప్పుడే పదవి చేపట్టా.. నేను ప్రధాన కార్యదర్శి పదవిని పార్టీ తిరోగమన దశలో ఉన్నప్పుడు చేపట్టా. పార్లమెంటులో మా బలం 44 నుంచి 9కి, లెఫ్ట్‌ఫ్రంట్ బలం 61 నుంచి 10కి చేరింది. అంతకుముందు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు మా చేతుల్లో ఉంటే నేను వచ్చేనాటికి ఒకటే మిగిలింది. నేను డౌన్లో పదవిని చేపట్టా. ఇప్పుడు అప్ (ఎదుగుదల) చూడాలి. నేను వచ్చిన తర్వాత కేరళలో గెలిచి ఒక మెట్టు ఎదిగాం. ఇప్పుడు రెండో మెట్టు కోసం కృషి చేస్తున్నాం. హోదా పోరులో వైఎస్సార్సీపీ కలిసొచ్చింది ఎన్టీఆర్‌తో, చిరంజీవితో పొత్తు పెట్టుకోని మాట నిజమే. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు రెండు టీడీపీ, వైఎస్సార్సీపీ. ఇద్దర్నీ చూస్తున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరాటంలో ముందుకొచ్చింది. మిగతా సందర్భాల్లో కారణం ఏమిటో తెలియదు. కన్హయ్య కుమార్‌కే మా మద్దతు ఢిల్లీ జేఎన్టీయూ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్య కుమార్ బిహార్‌లోని బెగుసరాయిలో పోటీ చేస్తే సీపీఎం మద్దతిస్తుంది. ఆర్జేడీ, కాంగ్రెస్ నుంచి ఏమైనా ఇబ్బంది వచ్చి వేరేచోటు నుంచి పోటీ చేయించాలని కూడా మేం భావించాం. బహుశా ఆయన బెగుసరాయి నుంచే బరిలో దిగొచ్చు. మార్పును ఆశించి ఓటేయండి కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలో నిర్దేశించే శక్తి తెలుగు రాష్ట్రాలది. ఇక్కడి ఓటర్లు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. 2004లో ఏపీలో 37 సీట్లు రాబట్టే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. 2009లో మళ్లీ 34 సీట్లతో యూపీఏ–2 వచ్చింది. అన్ని సీట్లు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావడం కష్టమయ్యేది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ఓటర్లపై ప్రత్యేక బాధ్యత ఉంది. కొత్త ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించి మార్పును ఆశించేవారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
‘దేశ ప్రజలకు ఎందుకు కాపలాగా లేరు’
సాక్షి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే మానవ హక్కులను కాపాడుకోలేమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజలను దోపిడీ నుంచి కాపాడాలని, బీజేపీ పాలనలో దళితులు, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. పుల్వామా ఉగ్రదాడి ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో ఏచూరి మాట్లాడుతూ.. వామపక్షాలు, లౌకిక శక్తులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్ని ఎన్నికలు ముందు విడివిడిగానే పోటీ చేస్తాయని, కానీ అధికారం కోసం ఎన్నికల అనంతరం కలుస్తాయని అన్నారు. ప్రజలు మంచి తీర్పునిస్తే.. కేంద్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాపలదారుడిని అని చెప్పుకునే నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు ఎక్కడ రక్షణగా ఉన్నారని ప్రశ్నించారు. దుర్మార్గ పాలనకు చరమగీతం: తమ్మినేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజలగొంతుకను వినిపించేందుకు పార్లమెంట్లో వామపక్షాల బలం పెంచాలన్నారు. కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఫిరాయించడం మంచిదికాదన్నారు. దేశంలో వామపక్షాల అవసరం ఎంతో ఉందన్న తమ్మినేని.. సీపీఎం, సీపీఐ ఐక్యంగా పోటీచేస్తాయని వెల్లడించారు. -
మోదీని, కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే: సీతారాం ఏచూరి
సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను గద్దె దించాల్సిందేనని, వారు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇబ్రహీంపట్నంలో బీఎల్ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి పగడాల యాదయ్యకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన సభలో ఏచూరి మాట్లాడారు. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామని చెప్పిన హామీని ప్రధాని మోదీ మరిచిపోయాడన్నారు. ఉన్న ఉద్యోగాలనే తగ్గిస్తున్నారని ఆరోపించారు. 12 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి దేశాన్ని వదిలి విదేశాలకు పారిపోయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సైన్యానికి కావాల్సిన విమానాల కొనుగోలులో 60 వేల రాఫెల్ కుంభకోణం జరిగినా.. విచారణ జరిపేందుకు మోదీ ఒప్పుకోవడంలేదని మండిపడ్డారు. ఆర్థికంగా దేశాన్ని మోదీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 93 శాతం మైనార్టీలు, దళితులు, గిరిజనులు, బీసీలున్నారని, సామాజిక న్యాయం జరగాలంటే వారు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. మతతత్వ శక్తులతో కుమ్మక్కై లౌకికతత్వ రాజ్యాగాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాడని విమర్శించారు. మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ఆరోపించారు. బీఎల్ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి యాదయ్యను గెలిపిస్తేనే పేదలకు, బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు. పేదల బతుకుల్లో మార్పులేదు... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల బతుకులు మారిపోతాయనుకుంటే.. అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రమొచ్చి ఐదేళ్లు కావస్తున్నా పేదల బతుకుల్లో మార్పులేదన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ బతుకులు బాగుపడాలంటే ఎలాంటి వారిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలన్నారు. బలహీన వర్గాల అభ్యర్థి పగడాల యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే... ఇబ్రహీంపట్నంరూరల్: దేశంలో నిజమైన దేశభక్తులెవరైనా ఉన్నారంటే అది కమ్యూనిస్టులు మాత్రమేనని బహుజన లెఫ్ట్‌ప్రంట్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ తోడెళ్లలాగా తయారై ప్రజలను పీక్కుతింటున్నాయని చెప్పారు. ఈ తోడెళ్ల నుంచి కాపాడి ప్రజలకు రక్షణ ఉండటానికి బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. బహుజన రాజ్యం రావాలంటే యాదన్నను గెలిపించాలని కోరారు. యాదన్న లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయితే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చారు. బీఎల్ఎఫ్లో మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారాజ్యం, బహుజన రాజ్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసం గతంలో గద్దర్, ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు మాట్లాడరని, వారి ఆత్మగౌరవాన్ని సోనియా, చంద్రబాబు కాళ్లముందు పెట్టరన్నారు. వామపక్ష ఐక్యత కోసం సీపీఎం కృషి చేస్తే సీపీఐ మాత్రం ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ నాయకులకు వద్ద పార్టీ గౌరవాన్ని తాకట్టు పెట్టారని అక్కడక్కడ సీపీఐ కార్యకర్తలే అంటున్నారని చెప్పారు. ఈ సభ సీపీఎం రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, లెల్లెల బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, సామేలు, జంగయ్య, మధుసూదన్‌రెడ్డి, జగదీష్, జగన్, మాజీ జడ్పీటీసీ కవిత, శ్రీనివాస్‌రెడ్డి, జంగయ్య , రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ మనసులో దళితులు లేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు స్థానం లేదని, ఆయన ప్రభుత్వానివి దళిత వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు జరిగిన ‘సింహగర్జన’ ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. చట్ట పరిరక్షణ సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే పూర్తి భద్రత ఏర్పడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరేంటో తెలపాలని రాహుల్‌ను మంద కృష్ణ కోరారు. ఈ ధర్నాలో సమితి కన్వీనర్లు జేబీ రాజు, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ సహా పలు రాష్ట్రాల దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల పాలనలో ఎన్డీఏ విఫలం
అనంతపురం న్యూసిటీ: కేంద్రంలో నాలుగేళ్ల పాలనలో ఆర్థిక, సాంఘిక తదితర అన్ని రంగాల్లో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. సోమవారం అనంతపురంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించడానికే వచ్చే ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పి కూడా అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తామే ప్రభుత్వం నడపాలని బీజేపీ యత్నిస్తోందని, అందుకు గోవా, మణిపూర్ ఎన్నికల్లే నిదర్శనమన్నారు. ఈ అనైతిక విధానాన్ని తిప్పికొట్టేందుకు కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపై కలిశాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎన్నడూలేని విధంగా దెబ్బతిన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపాయన్నారు. నల్లధనం విదేశాల్లో నుంచి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్న ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇటీవల స్విస్ బ్యాంకులో రూ.7 వేల కోట్ల భారతీయుల సంపద జమయ్యిందని, ఈ డబ్బు బ్యాంకుల్లో వేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఏవిధంగా అనుమతిచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల ఎన్డీఏ దుష్పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశ వ్యాప్త ప్రచారానికి సీపీఐ శ్రీకారం చుట్టనుందన్నారు. బీజేపీ ముందస్తు ఎన్నికలు చేపట్టాలని ప్రచారం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు నష్టం అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వంలో ప్రజలపై ఆర్ధిక భారం పెరిగింది
-
సీపీఎం బహిరంగ సభ ప్రారంభం
హైదరాబాద్: వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం అభ్యుదయ సామాజిక శక్తులన్నీ ఏకం కావాలనే ఆశయంతో సీపీఎం నిర్వహిస్తోన్న బహిరంగ సభ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జాతీయ నేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి.మధు, తెలకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలక్‌పేట టీవీ టవర్ నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు సీపీఎం కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ప్రజలపై ఆర్ధిక భారం పెరిగిందని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. లాల్ సలామ్, జైభీమ్ కలిస్తేనే కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. మూడో కూటమి విధానాలు చూసి కీలక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమే తమ లక్ష్యమన్నారు. దేశంలో మతోన్మాత రాజకీయాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు.నిజాం, రజాకార్లను ఎదుర్కొన్న మగ్దూం మొహినుద్దీన్ స్పూర్తితో భవిష్యత్ కోసం ముందడుగు వేయాలని సూచించారు. -
రాయని డైరీ
సీపీఎం గొప్పతనం ఇదే! అందరూ ఒక మాట మీద ఉంటారు. విడిగా మళ్లీ ప్రతి ఒక్కరూ ఒక మాటతో ఉంటారు. ఎంతమంది ఉంటే అన్ని మాటలు. ఎన్ని మాటలుంటే అన్ని సిద్ధాంతాలు. సమావేశాలయ్యే సరికి అంతా ఒక మాట మీదకు వచ్చేస్తారు. అందరూ కలిసి స్టేజీ మీద ఒక మనిషినే నిలబెట్టి మిగతావాళ్లంతా కిందికి వెళ్లి, కార్మికుల్లో కలిసిపోతారు! ఐదు రోజులుగా హైదరాబాద్‌లో తలా ఒక మాట మాట్లాడుతున్నాం. ముందు ప్రకాశ్ కారత్ ఒక మాట మాట్లాడాడు. తర్వాత నేనొక మాట మాట్లాడాను. నేను మాట్లాడిన మాటపై, కారత్ మాట్లాడిన మాటపై మళ్లీ ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడారు. కారత్ మాట్లాడిన మాట, జనవరిలో నేను మాట్లాడిన మాటకు ఎదురుమాట. సీపీఎంలో ఎవరూ వెంటనే మాటకు మాట అనేయరు. మళ్లీ వచ్చే జాతీయ మహాసభల వరకు ఆగుతారు. మాట అంటున్నప్పుడే ఒకవేళ మహాసభలు ముగిస్తే, పనిలో పనిగా మాట అనేసి స్టేజీ దిగిపోరు. స్టేజీ దిగిపోయాక.. మళ్లీ మూడేళ్లకు మహాసభల్లో మాట్లాడ్డానికి సిద్ధమౌతారు. డిసిప్లీన్! సీపీఎంలో ఉన్న మరో డిసిప్లీన్.. ఎవరు ఎవరి మాటకైనా ఎదురు చెప్తారు. ఎదురు చెప్పకపోతే ఎందుకు ఎదురు చెప్పలేదని ప్రశ్నిస్తారు. ‘నీకొక సిద్ధాంతం లేదా?’ అని నిలదీస్తారు. ‘నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందుకే ఎదురు చెప్పలేదు’ అని ఎవరైనా అంటే.. ‘ఏకీభవించడం కూడా మన పార్టీలో ఒక సైద్ధాంతిక విభేదమే కదా! విభేదించకుండా నువ్వసలు పార్టీ మనిషివెలా అవుతావని అడుగుతారు. శుక్రవారం నా మాట మీద, కారత్ మాట మీద పద్దెనిమిది గంటల డిబేట్ జరిగింది. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌ని దూరంగా పెడదాం’ అంటాడు కారత్. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌కి దూరంగా ఉందాం’ అంటాను నేను. దూరంగా పెట్టడమా, దూరంగా ఉండడమా అనే దానిపై డెలిగేట్స్ అంతా తలా ఒక మాట వేశారు. ‘దూరంగా పెట్టడం’, ‘దూరంగా ఉండడం’ అనే మాటలకు మూడొందల డెబ్బై మూడు సవరణలు చేశారు. కారత్ మాట నెగ్గితే ఈసారి మాణిక్ సర్కార్ కానీ, బృందాకారత్ కానీ, బీవీ రాఘవులు గానీ సీపీఎం ప్రధాన కార్యదర్శి అవుతారని మా ఇంటికి వచ్చే పేపర్ రాసింది. వెంటనే కారత్‌కి ఫోన్ చేసి, ‘‘మీ ఇంటికొచ్చే పేపర్ ఏం రాసింది కామ్రేడ్’’ అని అడిగాను. ‘‘మాణిక్ కానీ, బృందా కానీ, రాఘవులు కానీ ప్రధాన కార్యదర్శులు కాకపోతే ఏచూరి మాటే నెగ్గినట్లు అని రాశాయి కామ్రేడ్’’ అని చెప్పాడు. ‘నీమాటే నెగ్గుతుంది అన్నాడు కానీ, మళ్లీ రెండోసారి కూడా నువ్వే కార్యదర్శివి అవుతావు కామ్రేడ్’ అనే మాట అనలేకపోయాడు కారత్! సీపీఎంలో ప్రధాన కార్యదర్శి పదవికున్న వాల్యూ అది! దేశ ప్రధాని పదవినైనా వదులుకుంటారు కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇంకొకరికి పోనివ్వరు. -
కాంగ్రెస్‌తో దోస్తీకి సై
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా పని చేయాలని సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో తీర్మానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులను ఎదిరించే క్రమంలో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ఈ క్రమంలో అవసరమైతే కాంగ్రెస్‌తోనూ రాజకీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా రాజకీయ తీర్మానంపై దాదాపు 18 గంటల సుదీర్ఘ చర్చ, 37 సవరణల ఆమోదం అనంతరం ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్థానిక అవసరాల దృష్ట్యా బీజేపీయేతర ఏ పార్టీతోనైనా కలిసిపని చేయాలని నిర్ణయించారు. ఒక తీర్మానం.. రెండు బలమైన వాదనలు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ సమాన దూరం పాటించాలని ప్రకాశ్ కారత్ వాదిస్తూ వచ్చారు. దీనిపై కేంద్ర కమిటీలోనూ చర్చించి, ఆ మేరకు బుధవారం మహాసభల్లో ముసాయిదా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని, కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని, అలాంటప్పుడు అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్మానంలో కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుబట్టారు. కేంద్ర కమిటీలో చర్చ సందర్భంగా కూడా ఆయన ఈ విషయంపై గట్టిగా పట్టుబట్టారు. సభలో ఒకే తీర్మానంపై రెండు బలమైన అభిప్రాయాలు ముందుకు రావడం పార్టీలో రసవత్తర చర్చకు దారితీసింది. మద్దతు పలికినవారెవరు? మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతోపాటు ఏచూరి అభిప్రాయంపై గురు, శుక్రవారాల్లో వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 47 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. ముసాయిదా తీర్మానంపై మొత్తంగా 373 సవరణలను సూచించారు. మెజార్టీ సభ్యులు కారత్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపినట్లు మొదట్లో కనిపించినా తర్వాత ఏచూరి అభిప్రాయానికి అనుకూలంగా పరిస్థితి మారినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి వరకు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించారు. ఏచూరి అభిప్రాయానికి పశ్చిమ బెంగాల్ నేతలు గట్టి మద్దతు ఇచ్చారు. బీజేపీని ఓడించే ప్రయత్నంలోనే అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కొనసాగించాలని స్పష్టంచేశారు. వారికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన నేతలు కూడా జత కలిశారు. ఒక దశలో తమ అభిప్రాయాన్ని అంగీకరించకపోతే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టినట్టు తెలిసింది. ఏపీ నేతల ఝలక్! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏచూరికి ఇక్కడి నేతలే ఝలక్ ఇచ్చారు. ఆయన అభిప్రాయంతో విభేదించి కారత్ తీర్మానాన్ని సమర్థించారు. కేరళ నేతలు కూడ కారత్ తీర్మానంతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో మహాసభ రెండు వర్గాలుగా చీలిపోయి వాడివేడి చర్చకు దారితీసింది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్ జరిగింది. అప్పుడు ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. మహాసభల్లో ఓటింగ్ పెడితే కారత్ తీర్మానమే నెగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కారత్ మధ్యాహ్నామే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకుంటే, ఓటింగ్ నిర్వహించి తుది ముసాయిదా ప్రకటిస్తామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ జరగవచ్చనే అభిప్రాయమే వ్యక్తం చేశారు. మరోవైపు రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఏచూరి ఉన్నారని, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా ఏచూరి అభిప్రాయానికి తగ్గట్టుగా ముసాయిదాలో సవరణ చేశారు. కారత్ ప్రతిపాదించిన పొలిటికల్ లైన్లో ‘‘కాంగ్రెస్‌తో అవగాహన, ఎన్నికల పొత్తులు లేకుండా’’అనే పదాలను తొలగిస్తూ ముసాయిదాను సవరించారు. ఈ సవరణతో భవిష్యత్ ప్రజా ఉద్యమాల్లో సీపీఏం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే వెసులుబాటు ఏర్పడింది. -
నేటి నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
-
నేటి నుంచే ‘ఎర్ర పండుగ’
సాక్షి, హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండలం వేదికగా జరిగే ఈ ఐదు రోజుల సభల్లో పార్టీ పటిష్టత, రాజకీయ విధానాలపై చర్చించి భావి కార్యాచరణ రూపొందించనున్నారు. సీపీఎం రాజకీయ పంథాపైనా నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తాము అధికారం కోల్పోవడం, ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు, ఫెడరల్ ఫ్రంట్ తదితరాలపైనా చర్చ జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అగ్రనేతలు ప్రకాశ్‌కారత్, మాణిక్ సర్కార్, కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్రం నుంచి 35 మందితో సహా 846 మంది ప్రతినిధులు సభల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ఇదే.... వరుసగా రెండోసారి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం ఉదయం పదింటికి ఆర్టీసీ కల్యాణమండపంలో ‘మహ్మద్ అమీన్ నగర్’ప్రాంగణంలో పార్టీ పతాకావిష్కరణతో సభలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏచూరి సందేశం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్,) ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీఐ (సీ) నేతల సౌహార్ద సందేశాలు, కార్యదర్శి నివేదిక ఉంటాయి. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకుంటారు. అదే రోజు మలక్‌పేట టీవీ టవర్ నుంచి సభ జరిగే సరూర్‌నగర్ స్టేడియం దాకా 20 వేల మంది రెడ్‌షర్ట్ వలంటీర్లతో కవాతు జరుగుతుంది. సభకు జాతీయ నేతలు హాజరవుతారు. సభలు జరిగే ఆర్టీసీ కల్యాణమండపం పరిసరాలు ఎర్రజెండాలు, తోరణాలు, పోస్టర్లతో ఇప్పటికే ఎరుపెక్కాయి. తెలంగాణ సంస్కృతి, సాయుధ పోరాటం తదితరాలు ప్రతిబింబించే కళారూపాలనూ ఏర్పాటు చేశారు. మహాసభల్లో 25 అంశాలపై తీర్మానాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. మంగళవారం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశమై మహాసభల ఎజెండాను ఆమోదించాయి. రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చిస్తాం ‘‘పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ తీర్మానం, రాజకీయ, నిర్మాణ నివేదికలపై చర్చ జరుగుతాయి. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండవు. తెలంగాణలో బీఎల్ఎఫ్ బలోపేతంపై చర్చిస్తాం. మహాసభలకు సర్వం సిద్ధం చేశాం.’ – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
ద్రోహంలో టీడీపీ భాగస్వామి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఈ ద్రోహంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ ఎంపీల నిరవధిక నిరాహార దీక్షలకు ఆయన సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఇక్కడి ఏపీ భవన్లో దీక్షాస్థలికి శనివారం మధ్యాహ్నం వచ్చిన ఆయన ఎంపీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏచూరి వేదికపై నుంచి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘సీపీఎం నుంచి ఈ దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నా. కృతజ్ఞతలు ఆశించి రాలేదు. ఇది మా కర్తవ్యం.. బాధ్యత. మన ఆంధ్రప్రదేశ్‌కు, మన ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఎప్పుడైతే విభజన బిల్లు వచ్చిందో ఆనాడు మొదటిసారి నేను పార్లమెంటులో తెలుగులో మాట్లాడాను. పోలవరంపై.. విద్యుత్ సమస్యపై ఎప్పుడైనా చర్చించారా? ప్రభుత్వ ఉద్యోగుల పంపకాలపై మాట్లాడారా? చర్చించారా? ఇవన్నీ తేల్చకుండా ఎలా విభజిస్తారు? దీనివల్ల సమస్య మరింత పెరుగుతుందని చెప్పాను. ఈ నష్టాన్ని ఎలా భరిస్తారని ప్రశ్నించాను. అందులో నుంచి పుట్టిందే ప్రత్యేక హోదా అంశం. వెంకయ్యనాయుడు లేచి తమ ప్రభుత్వం వస్తే పదేళ్లు ఇస్తామన్నారు. కానీ, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. టీడీపీ వాళ్లు బీజేపీతో వెళ్లి పదేళ్లు తెస్తామని వాగ్దానం చేశారు. కానీ ఏం జరగలేదు. అందుకే ఈ పోరాటాలు. ఇక్కడ ఎంపీలు రాజీనామా చేసి దీక్షకు దిగారు. మా పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా ఏం చేయాలో అదీ చేస్తాం. అది మా బాధ్యత..’ అని ఏచూరి వివరించారు. బీజేపీ బెంబేలు కాగా, ఈ పార్లమెంటు సమావేశాలు విఫలమవడానికి కారణం బీజేపీయేనని, వారికి కావాల్సిన బిల్లులు.. ఏ చర్చా లేకుండా బడ్జెట్ పాస్ చేసుకుని అవిశ్వాసాన్ని మాత్రం చర్చకు రానీయలేదన్నారు. అవిశ్వాస తీర్మానం వస్తే వారి మిత్రపక్షాలైన శివసేన, అకాళీదళ్ ఏ వైఖరి తీసుకుంటాయోనని బీజేపీ బెంబేలెత్తిందని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీ, తెలంగాణలో పొత్తులపై స్పందించాలని కోరగా.. ఎన్నికల సందర్భంలో ఆలోచిస్తామని ఏచూరీ బదులిచ్చారు. -
మేకపాటికి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ‘ప్రత్యేక హోదా’ సాధన కోసం పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మద్దతు వెల్లువెత్తుతోంది. ఆమరణ నిరాహారదీక్ష మూడోరోజుకు చేరుకుంది. ఎంపీలందరిలోనూ పెద్దవారైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండోరోజైన శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 73 ఏళ్ల రాజమోహన్‌రెడ్డి వయసు సహకరించకపోయినా అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం ఉదయం వాంతులతో ఇబ్బందికి గురైనా దీక్ష కొనసాగించారు. సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా హక్కుగా లభించిన ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ దేశరాజధానిలో వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం పెరుగుతోంది. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎంపీలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. తొలిరోజైన శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, వర్షానికి దీక్షా శిబిరం నేలమట్టమైనప్పటికీ మొక్కవోని దీక్షతో ఏపీ భవన్లో వీరంతా నిరశన కొనసాగించారు. శిబిరాన్ని తిరిగి సిద్ధం చేయడంతో శనివారం దీక్షలను అక్కడికి మార్చారు. క్షీణించిన మేకపాటి ఆరోగ్యం.. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విపరీతమైన తలనొప్పి, హైబీపీ, వాంతులతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అయితే దీక్ష విరమించేందుకు అంగీకరించని మేకపాటి ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా లెక్కచేయకుండా తన దీక్షను కొనసాగించారు. ఉదయం 11 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు మేకపాటి బీపీ 150/90, షుగర్ లెవెల్స్ 119, పల్స్‌రేటు 76గా ఉన్నాయి. ఈ క్రమంలో సాయంత్రం మేకపాటి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏపీ భవన్ రెసిడెంట్ డాక్టర్ బల్లా, రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన డా.అఫీన్, డా.పాప్రీలు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం బీపీ 180/80కి చేరుకోవడంతో దీక్ష కొనసాగిస్తే తీవ్ర ప్రభావాలు ఉంటాయని, విరమించాల్సిందిగా సూచించారు. అయినా దీక్షను విరమించేందుకు మేకపాటి నిరాకరించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆంబులెన్స్‌లో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకొనేందుకు ప్రయత్నించాయి. పోలీసులు మేకపాటిని బలవంతంగా ఆంబులెన్స్ ఎక్కించి సమీపంలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మేకపాటిని ఐసీయూలో ఉంచి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వాంతులు ఆగకపోవడంతో ఆదివారం ఉదయం వరకు ఐసీయూలోనే ఉండాలని సూచించారు. అబ్జర్వేషన్ అనంతరం తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. కాగా, దీక్షలో ఉన్న ఎంపీలు వివిధ జాతీయ, ప్రాంతీయ టీవీ చానెళ్లతో మాట్లాడుతూ.. తామెందుకు పోరాటం చేస్తున్నదీ వివరించారు. విభజన వల్ల ఏపీ ఎంత అన్యాయం అయిపోయిందీ, అలాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ యువకులు, విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి లేక ఎంతగా నష్టపోయేదీ ఎంపీలు వారికి తెలిపారు. ప్రత్యేక హోదా ఏమీ భిక్ష కాదని, అది తమ హక్కు అని వారు నిర్ద్వంద్వంగా చెప్పారు. ఎంపీలు చేస్తున్న ఈ నిరాహారదీక్ష మొత్తం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో గట్టిగా నినదించడంతో పాటు వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలివ్వడమే కాక, అమరణ దీక్షకు పూనుకోవడం ఢిల్లీ వర్గాల్లో బాగా చర్చనీయాంశం అయింది. అందుకే ఢిల్లీ నలుమూలల నుంచీ ఆంధ్రులు తమ కుటుంబీకులతో కలిసి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో వాంతులు చేసుకుంటున్న మేకపాటి -
ఆత్మహత్యలు పెరిగే అవకాశముంది: ఏచూరీ
నల్గొండ : రైతుల రుణమాఫీ చేయకపోవడంతో రైతుల ఫై రుణభారం పెరిగి రైతు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. సీపీఎం రాష్ట్ర సభ ఆదివారం నల్గొండలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం మతఘర్షణలు ఎక్కువయ్యాయని, మతోన్మాదం ఎక్కువై ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ దేశ ప్రజలను భ్రమలకీ గురి చేస్తూ, హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి వాటి ద్వారా ఓటు బ్యాంకు సంపాదించాలనుకుంటున్నానడని ఆరోపించారు. సీపీఎం సీనియర్ నేత రాఘవులు మాట్లాడుతూ..గత 4 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్రలోని దళితులపై బీజేపీ దాడులకు పాల్పడుతుందని, చిన్న పిల్లల ఫై అఘాయిత్యాలకు పాల్పడుతూ,ఎంతో చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ మన నిర్మాణం కాదంటూ అవమాన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. -
ప్రత్యామ్నాయ వేదికకు ఆదిలోనే గండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను తయారు చేయాలని సీపీఎం చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. గత మూడేళ్లుగా వివిధ ఆందోళన కార్యక్రమాల్లో భుజం, భుజం కలిపి పాల్గొన్న ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని సీపీఎం భావిస్తోంది. దీనికోసం వివిధ కుల సంఘాలు, సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలతోనూ చర్చించి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కు రూపకల్పన చేసింది. ఎంసీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, బీఎస్పీ, ఎంబీటీ, లోక్‌సత్తా తదితర 28 పార్టీలు బీఎల్ఎఫ్లో చేరాయి. అయితే మరో ప్రధాన వామపక్ష పార్టీ సీపీఐ ఈ వేదికకు దూరంగా ఉంటామని, తామే లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష కూటమిని తయారు చేస్తున్నామని ప్రకటించింది. దీనికి తోడు సీపీఐ ఎం–ఎల్ (న్యూ డెమొక్రసీ) సైతం బీఎల్ఎఫ్లో చేరే విషయాన్ని ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఆ పార్టీ కూడా ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్టేనని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఎల్ఎఫ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ అంబేడ్కర్ ఈ సభకు హాజరవుతున్నారని గురువారం ప్రకటించారు. కాగా, ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే సీపీఐ రాత్రికి రాత్రి తాము కూడా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో బహుజన వామపక్ష కూటమికి ఆదిలోనే హంసపాదు పడినట్లు తెలుస్తోంది. ముందు నుంచీ అంతే: ముందు నుంచీ సీపీఎం, సీపీఐ మధ్య పొసగడం లేదని, ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు ఆమోదించే పరిస్థితులు లేవని, ఈ తరుణంలో వామపక్షాల ఐక్యత సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో రెండు పార్టీలూ ఆయా ఎన్నికల్లో సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. ఖమ్మం, మధిర, భద్రాచలం, మిర్యాలగూడెం, నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం, తదితర నియోజకవర్గాలకు గతంలో సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం ఆ పార్టీ చేతిలో ఒక్క భద్రాచలం మాత్రమే మిగిలింది. కాగా, బెల్లంపల్లి, పరకాల, మహబూబాబాద్, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో సీపీఐ ప్రాతినిధ్యం వహించింది. గత ఎన్నికల్లో దేవరకొండ నుంచి సీపీఐ గెలిచినా, ఆ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఒక్క సీటు కూడా ఆ పార్టీ చేతిలో లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఈ రెండు పార్టీలూ ఉనికి కోసం పోరాడుతున్నాయి. -
హిందూ రాష్ట్ర అభివృద్ధి శాఖగా మార్చనీయకండి
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీతారాం ఏచూరి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖను హిందూ రాష్ట్ర డెవలప్మెంట్ మినిస్ట్రీగా మార్చకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలసి ఒక వినతిపత్రం సమర్పించింది. ‘సెంట్రల్ వర్శిటీకి మీరు విజిటర్‌గా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వీసీ నియామకంపై వివాదం నడుస్తోంది. రోహిత్ ఆత్మహత్య తర్వాత దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఈ నెల 22న మళ్లీ వర్శిటీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోగానే విద్యార్థులపై లాఠీ దాడి మీకు తెలిసే ఉంటుంది. ఈ వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వసతి గృహాలకు నల్లా కనెక్షన్లను తొలగించారు. హాస్టల్ మెస్‌కు ఆహార సరఫరా నిలిపివేశారు. పోలీసు చర్యపై ఈ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదిగా పేర్కొంది. హెచ్చార్డీ మీవైపు మాకు దారి చూపించింది. అందువల్ల మీరు తక్షణం జోక్యం చేసుకుని సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడగలరు’ అని కోరారు. -
'ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేయండి'
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎమ్మెల్యేతో బేరసారాల్లో స్వయంగా ముఖ్యమంత్రే భాగస్వామ్యంకావడంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సీతారాం కోరారు. ఇలాంటి తప్పు మరొకటి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. స్టీఫెన్‌సన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడినప్పటి ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి. -
బీజేపీ మతపర రాజకీయాలను ప్రోత్సహిస్తోంది
-
'ఏపీ తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పునర్విభజన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు. సంవత్సరకాలంలో మోదీ 18 దేశాలకు వెళ్లారని, గతంలో ఏ ప్రధాని ఏడాదిలో ఇన్ని దేశాలకు వెళ్లలేదని ఏచూరి చెప్పారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ సిఫారసులతో గవర్నర్లను నియమిస్తున్నారని ఏచూరి ఆరోపించారు. -
సీతారాం ఏచూరికి కేసీఆర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపా రు. సోమవారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ప్రజల పక్షాన నిలిచే బాధ్యతాయుత ప్రతి పక్ష పాత్రలో పార్టీని నిర్మాణాత్మకంగా నడపడంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.