సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై మరోసారి బదిలీ వేటు పడింది. రెండు వారాల్లో ఆయనను కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు బదిలీ చేసింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై మరోసారి బదిలీ వేటు పడింది. రెండు వారాల్లో ఆయనను కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు బదిలీ చేసింది. తొలుత ఆర్థిక శాఖ నుంచి పర్యాటక శాఖకు కార్యదర్శిగా ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా మైనారిటీ వ్యవహారాల శాఖకు పంపింది. ఇది పర్యాటక శాఖ కంటే మరింత తక్కువ స్థాయి పోస్టు అని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
1979 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై ఎందుకు ఇన్నిసార్లు బదిలీవేటు పడుతోందన్నది మాత్రం ప్రస్తుతానికి అర్థం కాని వ్యవహారంలాగే ఉంది. అయితే.. ఆర్థికశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే తొలుత ఈ బదిలీల ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది.