
సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 17 అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విలీన దినోత్సవంగా ప్రకటించాలని సూచించారు. బీజేపీ, ఎంఐఎం దీనికి మతం రంగు పులుముతున్నాయని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం లొంగకూడదని అన్నారు.