లోక్‌సభలో ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ పంటలు, రహదారులు దెబ్బతిని రూ.2,740 కోట్ల మేర నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇది వరకే అందజేశారన్నారు. ఈ నివేదిక మేరకు రాష్ట్రానికి నష్టపరిహారం కింద నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు.
వర్షాల వల్ల రూ.2,740 కోట్ల నష్టం
Published Wed, Nov 23 2016 4:28 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
Advertisement
Advertisement