ఏడుగురు ఉగ్రవాదుల హతం | Seven m ilitants, policem an killed in Kashm ir gunfights | Sakshi
Sakshi News home page

ఏడుగురు ఉగ్రవాదుల హతం

Published Mon, Sep 12 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

Seven m ilitants, policem an killed in Kashm ir gunfights

శ్రీనగర్: కశ్మీర్లో ఆదివారం ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ పట్టణంలో జంట ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు సహా నలుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. నలుగురు ఉగ్రవాదులు ఒక ఇంట్లోను, నిర్మాణంలో ఉన్న ఉప సచివాలయం దగ్గర్లోని మరో భవనంలోను దాక్కొని ఉండగా ఉదయం 7.30 గంటల సమయంలో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు మొద లయ్యాయి. ముగ్గురు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. బందీలుగా ఉన్న పౌరులను సురక్షితంగా విడిపించాయి. మరో ఘటనలో నౌగాం సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన మరో నలుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement