ముంబై: దేశ భద్రత, సరిహద్దు వివాదాలను రాజకీయం చేయవద్దని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ సూచించారు. గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో శనివారం శరద్ పవార్ స్పందిస్తూ.. దేశ భద్రతను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. (కరోనా: డెక్సామెథాసోన్‌కు కేంద్రం అనుమతి)
అదే విధంగా 1962 భారత్- చైనా యుద్ధం అనంతరం చైనా ఆక్రమించుకున్న 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఇప్పటికీ మరచిపోలేమని శరద్ పవర్ పేర్కొన్నారు. అది ఇంకా చైనా అధీనంలోనే ఉందనే విషయాన్ని శరద్ పవార్ తాజాగా ప్రస్తావించారు. ఇప్పుడు ఏమి జరిగిందనే విషయం తనకైతే పూర్తిగా తెలియదన్నారు. కానీ దేశ భద్రత అంశాల్లో రాజకీయాలు తగదన్నారు. లద్దాక్ సమీప సరిహద్దుల్లోని గల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఘటనను రక్షణ మంత్రి, ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపించడం సరికాదన్నారు. ఇక గల్వాన్ లోయ వద్ద పొరుగు దేశం చైనాతో జరిగిన ఘర్షణ పరిస్థితులు చాలా సున్నితమైనవని తెలిపారు. గల్వాన్ లోయాలో చైనా.. భారత ఆర్మీని రెచ్చగోట్టే పాత్ర పోషించిందని పేర్కొన్నారు. జూన్ 15 రాత్రి తూర్పు లద్దాక్‌లో చైనాతో జరిగిన హింసాత్మాక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ('గాల్వాన్ లోయలో సైనికుల మరణాలకు మీరే కారణం')
Comments
Please login to add a commentAdd a comment