
కొత్త శకానికి నాంది
భారత్-జపాన్ బంధం అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బంధంగా జపాన్ ప్రధాని షింజో అబె అభివర్ణించారు. భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండో-జపాన్ బంధం అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు
- కొత్త శకంలోకి ప్రయాణిస్తున్నాం :మోదీ
- ఇక తిరుగులేని విజయాలు సాధిద్దాం
- నమ్మకమే పునాది ఏర్పడ్డ బంధం : షింజో అబె
- ఇండో-జపాన్ బంధం ప్రత్యేకమైంది
సాక్షి, అహ్మదాబాద్ : భారత్-జపాన్ బంధం అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బంధంగా జపాన్ ప్రధాని షింజో అబె అభివర్ణించారు. భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండో-జపాన్ బంధం అత్యంత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇండో-జపాన్ బంధం వల్ల భారత్ సాంకేతికంగా కొత్త శకంలోకి ప్రయాణిస్తుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రయిన్ శంకుస్థాపనకు భారత్ వచ్చిన షింజే అబెతో కలసి మోదీ అహ్మదాబాద్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ రీజియన్‌లో శాంతి, ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్నాయని చెప్పారు.
జపాన్ ప్రధాని మాట్లాడుతూ.. భారత్‌తో ఆర్థిక, వ్యాపార బంధాలను బలోపేతం చేసుకునేందేకు ఆసక్తిని చూపుతున్నట్లు చెప్పారు. అందులో భాంగగానే ఇక్కడ బుల్లెట్ ట్రయిన్ ఏర్పాటు చేసేందుకు ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. భారత్ ప్రస్తుతం ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా సాధిస్తోందని అన్నారు. భారత వృద్ధిరేటును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన హై స్పీడ్ రైళ్ల సాంకేతికను ఇకముందుకూడా అందిస్తామని చెప్పారు.
మా దగ్గర ఆత్యంత శక్తివంతమైన, పటిష్టమైన సాంకేతికత, వాటిని నిర్వహించే సంస్థలున్నాయి.. భారత్‌లో తిరుగులేని మానవ వనరులు ఉన్నాయి.. ఈ రెండింటిని మేళవిస్తే.. ప్రపంచంలో మనం తిరుగులేని విజయాలను సాధించవచ్చిన షింజో అబె చెప్పారు. ఒప్పందాల మూలంగా భారత్-జపాన్‌ల మధ్య బంధం ఏర్పడలేదని.. ఇది పరస్పర నమ్మకం మీద ఏర్పడిందని అబె చెప్పారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు జపాన్‌కు దగ్గరగా ఉంటాయని అబె పేర్కొన్నారు. ఇక్కడ పుట్టిన బౌద్ధమతం, యోగా మేంకూడా అనుసరిస్తామని చెప్పారు. ఇక్కడి సినీనటులకు జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పారు.