25 ఏళ్ల బీజేపీ-శివసేన పొత్తుకు బ్రేక్?
25 ఏళ్ల బీజేపీ-శివసేన పొత్తుకు బ్రేక్?
Published Sun, Sep 21 2014 6:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, శివసేన 25ఏళ్ల బంధానికి బ్రేక్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్రలోని 288 సీట్లలో బీజేపీకి 119 సీట్లను కేటాయించాలని శివసేన నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ.. 2002 గుజరాత్ మత ఘర్షణల్లో నరేంద్రమోడీకి అప్పటి శివసేన అధినేత బాల్ థాక్రే బాసటగా నిలిచారు అన్నారు. అలాగే రాష్ట్రంలోని మహాకూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీతో పొత్తుకు చివరిగా ప్రయత్నిస్తున్నానని ఉద్దవ్ అన్నారు. తొలుత 160 సీట్లలో పోటీ చేయాలని అనుకున్నామని.. బీజేపీతో పొత్తు కోసం మరో తొమ్మిది సీట్లను వదులుకోవడానికి ఓ మెట్టు దిగామన్నారు. బీజేపీకి 119 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్దవ్ తెలిపారు.
Advertisement