పోటీకి సిద్ధూ సై.. ఏపార్టీయో తెలుసా?
Published Fri, Jan 6 2017 7:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
పంజాబ్‌లో ఎన్నికల జోరు ఊపందుకుంది. గెలుపుకోసం అన్ని పార్టీలు నామినేషన్ల వేటలో పడ్డ తరణంలో... మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం అధికారికంగా తేలిపోయింది. ఇన్నాళ్ల బట్టి ఆయన ఏ పార్టీలో చేరారో కచ్చితంగా ప్రకటన రాకపోయినా.. ఇప్పుడు ఆ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు.
తన భార్య ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృతసర్ (తూర్పు) నుంచే సిద్ధూ పోటీ చేయనున్నారని ఆయన తెలిపారు. క్రికెటర్ నుంచి రాజకీయవేత్తగా మారిన సిద్ధూ బీజేపీ నుంచి 2016, సెప్టెంబర్ 14న బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని వినవచ్చినా, అక్కడ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన ఉండటం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ముందుగా మాట ఇవ్వకపోవడంతో బేరం కుదరక.. కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు చెబుతున్నారు.
Advertisement
Advertisement