అలీని కొట్టినందుకు సోనాలికి శిక్ష! | Sonali punished by Bigg Boss for slapping Ali | Sakshi
Sakshi News home page

అలీని కొట్టినందుకు సోనాలికి శిక్ష!

Published Fri, Nov 28 2014 3:04 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

అలీని కొట్టినందుకు సోనాలికి శిక్ష! - Sakshi

అలీని కొట్టినందుకు సోనాలికి శిక్ష!

ముంబై:ఎన్నో సంచలనాలతో ఆరంభమైన బిగ్ బాస్ -8 లో మరో వివాదం చోటు చేసుకుంది. బిగ్ బాస్ -8లో బాలీవుడ్ నటి సోనాలి రౌత్  తన సహనాన్ని కోల్పోయి షో నుంచి బహిష్కరణకు గురయ్యింది.  బిగ్ బాస్ షో  నామినేషన్ లో భాగంగా హాజరైన సోనాలితో పునీత్ మరియు అలీ ఖలీ మిర్జాలు చిట్ చాట్ లో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా పునీత్, అలీలు వాదనలు సోనాలికి విసుగుతెప్పించాయి. దీంతో సోనాలి సహనం కోల్పోయి ఒక్కసారిగా అలీ చెంప చెళ్లు మనిపించింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన అలీ మూటా ముళ్లు సర్దుకుని ఆ షో నుంచి వెళ్లిపోయాడు. సోనాలితో వాదనలు జరుగుతుండగా తాను పదే పదే అడ్డుతగిలాననే ఆమె సహనాన్ని కోల్పోయి తనతో అసభ్యంగా ప్రవర్తించిందని అలీ స్పష్టం చేశాడు. దీంతో సోనాలిని షో నుంచి బహిష్కరిస్తున్నట్లు బిగ్ బాస్ టీం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement