న్యూఢిల్లీ: సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయనందుకు కేంద్రసమాచార కమిషన్ (సీఐసీ) పార్టీలపై చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ సోనియాతో పాటు ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయాలన్న తమ ఆదేశాలను పాటించనందుకు విచారణ ఎందుకు చేపట్టరాదో తెలియజేయాలంది. గతేడాది సుభాష్ అగర్వాల్ అనే కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ మేరకు సీఐసీ ఈ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చింది.
అయినా ఆ పార్టీలు కమిషన్ ఆదేశాలను పాటించలేదు. దీనిపై లోగడ రెండు సార్లు సీఐసీ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2013, జూన్3న తామిచ్చిన ఆదేశాలను పాటించనందుకు విచారణ ఎందుకు ప్రారంభించరాదో నాలుగు వారాల్లో తెలియజేయాల సీఐసీ తాజా నోటీసులిచ్చింది. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది.
సోనియాకు, అమిత్‌షాకు సీఐసీ నోటీసులు
Published Mon, Sep 15 2014 1:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement