ఘర్షణల్లో చూపు కోల్పోయిన కలెక్టర్, నేత్రదానానికి సిద్దమైన ఓ నేత! | SP leader proposes to donate eye for injured Moradabad DM | Sakshi
Sakshi News home page

ఘర్షణల్లో చూపు కోల్పోయిన కలెక్టర్, నేత్రదానానికి సిద్దమైన ఓ నేత!

Published Mon, Jul 7 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

SP leader proposes to donate eye for injured Moradabad DM

లక్నో: హింసాత్మక ఘర్షణల్లో కళ్లు కోల్పోయిన ఓ జిల్లా కలెక్టర్ కు సమాజ్ వాదీ పార్టీ నేత నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని కాంత్ ఏరియాలో జరిగిన హింసాత్మక సంఘటనలో మొరాదాబాద్ జిల్లా కలెక్టర్ కళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
నేత్ర, రక్త దానం కంటే మించినది ఈ ప్రపంచంలో ఏమిలేవు. చంద్రకాంత్ లాంటి నిజాయితీపరుడైన అధికారికి నా కళ్లు చూపు తీసుకువస్తే అంతకంటే గొప్ప గౌరవం తనకేముంటుంది అని ఎస్పీ నేత అమిత్ జానీ అన్నారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు. 
 
ఓ ఆలయంలో లౌడ్ స్పీకర్ తొలగింపు వ్యవహారంలో కాంత్ ఏరియాలో జూలై 4 తేదిన జరిగిన హింసాత్మక సంఘటనలో చంద్రకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చంద్రకాంత్ కు చికిత్స జరుగుతోంది. చంద్రకాంత్ కు కళ్లు దానం చేయడానికి ముందుకు వచ్చిన అమిత్ జానీపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement