సాక్షి, న్యూఢిల్లీ : భోపాల్ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఊరట లభించింది. ఆమె నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్ఞా సింగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించలేమని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. 2008 మాలేగావ్ పేలుళ్లలో తన కుమారుడిని కోల్పోయిన వ్యక్తి ప్రజ్ఞా సింగ్ నామినేషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
మాలెగావ్ పేలుడు కేసులో ప్రజ్ఞా సింగ్ నిందితురాలు కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఎవరినైనా నియంత్రించే అధికారం తమకు లేదని, దీనిపై ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకోవాలని ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తేల్చిచెప్పింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు తమ న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేయలేదని పేర్కొంది. పిటిషనర్ ప్రజ్ఞా సింగ్ నామినేషన్‌ను సవాల్ చేస్తూ సరైన వేదికను ఆశ్రయించలేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment