హిమగిరులలో శివనామస్మరణ | start the amarnath yatra | Sakshi
Sakshi News home page

హిమగిరులలో శివనామస్మరణ

Published Sat, Jun 28 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

హిమగిరులలో శివనామస్మరణ

హిమగిరులలో శివనామస్మరణ

మొదలైన అమర్‌నాథ్ యాత్ర  తొలి బ్యాచ్‌లో 1,160 మంది భక్తులు
 
జమ్మూ: ఈ ఏడాదికి సంబంధించి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయ పర్వత సానువుల్లో అమర్‌నాథ్ గుహలో కొలువుదీరిన హిమలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ప్రయాణం మొదలుపెట్టారు. తొలి బ్యాచ్‌లో 1,160మంది భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించనున్నారు. వీరిలో 957 మంది పురుషులు, 187 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. ఈ యాత్రను జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంప్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యాటక మంత్రి గులామ్ అహ్మద్‌మీర్ ప్రారంభించారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య 42 వాహనాలలో భక్తులు బయల్దేరి వెళ్లారు. పహల్గామ్ మార్గం మంచుతో మూసుకుపోవడంతో వీరి యాత్ర బల్తాల్ మార్గం గుండా కొనసాగనుంది. సాధారణంగా ఏటా పహల్గామ్ మార్గంలోనే యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో మంచు పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement