హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభను తప్పుదారి పట్టించారంటూ విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది.
లోక్‌సభలో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభను తప్పుదారి పట్టించారంటూ విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఇరానీపై తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో గందరగోళం సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. తరువాత కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... రోహిత్ ఆత్మహత్యాయత్నం అనంతరం ఆయనకు వైద్యం అందించలేదని స్మృతి చెప్పారని, కానీ అది అవాస్తవమని పేర్కొన్నారు.