
టీ.నగర్: నీట్ పరీక్ష శిక్షణ కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రూ.లక్ష రుణం తీసుకుని చదివి ఉత్తీర్ణురాలైంది. పెరుంబాక్కం స్లమ్ క్లియరెన్స్ బోర్డు గృహంలో జానకీరామన్ నివసిస్తున్నారు. ఇతను రోడ్డు పక్కన పండ్ల రసం విక్రయిస్తుంటాడు. ఇతనికి నలుగురు కుమార్తెలు. నలుగురిలో రెండో కుమార్తె చారుమతి. ఈమె ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 370 మార్కులు పొంది ఉత్తీర్ణురాలైంది. దీంతో చారుమతికి పుదుక్కోటై ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు లభించింది. ఈమె కేళంబాక్కం ప్రభుత్వ పాఠశాలలో చదివింది. చారుమతి పాఠశాల విద్యలో ఉన్నతంగా రాణించింది. ఇలావుండగా ఆమె మెడిసిన్ చదివేందుకు ఆసక్తి చూపింది. ఈమె ప్లస్‌టూ చదివిన తర్వాత ఒక ఏడాది వేచిచూసింది. నీట్ పరీక్ష రాయాలంటే శిక్షణా సంస్థలో చేరాలి. ఇందుకు ఫీజు చెల్లించే స్థోమత లేకుండా పోయింది. దీంతో రూ. లక్ష రుణం తీసుకుని అడయారులోని శిక్షణ సంస్థలో చదివి ఉత్తీర్ణురాలైంది.
Comments
Please login to add a commentAdd a comment