ఇటువంటి ఘటనలు సహజమే | Such events are casual | Sakshi
Sakshi News home page

ఇటువంటి ఘటనలు సహజమే

Published Thu, Jun 5 2014 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఇటువంటి ఘటనలు సహజమే - Sakshi

ఇటువంటి ఘటనలు సహజమే

 సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కొట్టిచంపడంపై శిరోలే వివాదాస్పద వ్యాఖ్యలు
 
 పుణే: ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేసినప్పుడు ఇటువంటి పరిణామాలు జరగడం సహజమేనంటూ బీజేపీ నేత, పుణే ఎంపీ  అనిల్ శిరోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివాజీ, బాల్‌ఠాక్రేలపై అభ్యంతరకరమైన అంశాలను పోస్ట్ చేశాడనే అనుమానంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షేఖ్ మొహిసిన్ సాదిఖ్‌ను హిందూ రాష్ట్ర సేనకు చెందిన కొందరు గురువారం తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే.
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాదిఖ్ మృతిచెందడంతో ఈ విషయమై ఎంపీ అనిల్ శిరోలేను పార్లమెంటు ఆవరణలో పాత్రికేయులు ప్రశ్నించినపుడు ఆయన పైవిధంగా స్పందించారు. ఇదిలాఉండగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై బుధవారం దాడిచేసిన ఘటనకు సంబంధించి పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టు చేసినవారి సంఖ్య 17కు చేరింది. అత్యంత దారుణమైన ఘటనకు పాల్పడిన వీరిపై బెయిల్ దొరకడానికి వీలులేని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement