‘ఆత్మహత్య’ రైతులు పిరికిపందలు, నేరగాళ్లు | Suicide ' coward farmers , criminals says op thankar | Sakshi
Sakshi News home page

‘ఆత్మహత్య’ రైతులు పిరికిపందలు, నేరగాళ్లు

Published Thu, Apr 30 2015 2:17 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

‘ఆత్మహత్య’ రైతులు పిరికిపందలు, నేరగాళ్లు - Sakshi

‘ఆత్మహత్య’ రైతులు పిరికిపందలు, నేరగాళ్లు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా వరుస రైతు ఆత్మహత్యల నేపథ్యంలో, ప్రాణాలు తీసుకుంటున్న రైతులు పిరికిపందలు, నేరగాళ్లంటూ హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి ఓపీ ధంకర్ బుధవారం వ్యాఖ్యానించారు. ‘భారత చట్టాల ప్రకారం ఆత్మహత్య నేరం. దానికి పాల్పడే వారంతా బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. కుటుంబ భారాన్నంతా భార్యాపిల్లలపై వేసి ఆత్మహత్య చేసుకునే వారు పిరికిపందలు’ అని ధంకర్ అన్నారు. రైతు కుటుంబాలకు నష్టపరిహారంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఇలాంటి పిరికిపందలకు(ఆత్మహత్య చేసుకునే వారికి) అండ గా నిలవదన్నారు. బీజేపీ కిసాన్ సెల్‌కు మాజీ అధ్యక్షుడు అయిన ధంకర్ వ్యాఖ్యలపై అన్ని పక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement