
సన్నీలియోన్
లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో సవరించిన ఓటర్ల జాబితాలో బాలీవుడ్ నటి సన్నిలియోన్ ప్రత్యక్షమైంది. పైగా ఆమె పేరు వయసు కూడా మారిపోయింది. ఈ జాబితాలో 51 ఏళ్ల దుర్గావతి సింగ్‌గా ఆమె ఫొటో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బలియా ఓటర్ల సవరణ కార్యక్రమంలో అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. కొందరికి వారి ఫొటోల బదులు జంతువుల ఫొటోలు ప్రింటయ్యాయి.
56 ఏళ్ల నారదా రాయ్ అనే మహిళా స్థానంలో ఆఫ్రికన్ ఎనుగు, 51 ఏళ్ల దుర్గావతి సింగ్‌కు బదులు సన్నీ ఫొటోలు పొరపాటుగా వచ్చాయి. ఈ జాబితా ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇన్ సెట్‌లో సన్నీలియోన్ ఫొటో
Comments
Please login to add a commentAdd a comment