
న్యూఢిల్లీ: మానవ హక్కుల కోసం ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశం గురించి నివేదిక ఇవ్వడంలో విఫలమయ్యాయంటూ ఏడు రాష్ట్రాలకు వేర్వేరుగా రూ.లక్ష వరకూ సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందిగా గత ఏడాదే సూచించినప్పటికీ ఏర్పాటు చేయకపోవడం వల్లే జరిమానా విధించినట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ బీఆర్ దవైల ధర్మాసనం తెలిపింది. ఈ కేసు మంగళవారం వాదనలకు రాగా కనీసం తమ రాష్ట్రాల తరపున లాయ ర్లు కూడా హాజరుకాకపోవడంతో రాజస్తాన్. ఉత్తరాఖండ్‌లకు లక్ష జరిమానా విధించింది.
తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాంలకు రూ.50 వేల చొప్పున పెనాల్టీ విధించింది. మానవ హక్కుల చట్టం 1993 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక లాయర్‌ను నియమించాలని గతేడాదే సుప్రీం సూచించింది. తిరిగి నాలుగు వారాల్లోగా తమ నివేదికలను సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. ఈ జరిమానాను మైనర్ల కేసుల విచారణ కోసం వాడతామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment