న్యూఢిల్లీ: ‘ప్రభుత్వాలు మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నాయి. పర్యా వరణ పరిరక్షణ, ప్రజల ప్రయోజ నాల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు రూ.లక్ష కోట్లను ఇతర కార్యక్రమాల కోసం మళ్లించారు’ అని దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళ వారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కార్యనిర్వాహక వ్యవస్థపై తాము చాలా నమ్మకం పెట్టుకున్నామని, అయితే అధికారులు ఎటువంటి పనీ చేయడం లేదని, దీనికి సంబంధించి కోర్టు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే న్యాయస్థానాలు పరిధి దాటుతున్నాయని విమర్శలు వస్తున్నాయంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ పేర్లతో నిధులను సృష్టించారని, ఇలా సేకరించిన భారీ మొత్తం నిధులను పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగిం చాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, బస్టాండ్ల పునరుద్ధరణకు, కాలేజీల్లో సైన్స్ లేబొరేటరీల నిర్మాణానికి వినియోగించామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందు కోసమైతే ఆ నిధులను కేటాయించారో.. అందుకోసం మాత్రమే వాటిని వినియోగించాలంది. ‘మీరు ఆ నిధులను దారిమళ్లించారు. మా నమ్మకాన్ని వమ్ము చేశారు. మేము చిన్న మొత్తం గురించి మాట్లాడటం లేద’ంటూ.. ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment