♦ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్
♦ వారు మళ్లీ ప్రవేశ పరీక్ష రాయాలన్న మరో జడ్జి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన వ్యాపం కేసు నిందితులకు శిక్ష విధింపుపై సుప్రీం కోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు ఇచ్చింది. 640 మంది వైద్య విద్యార్థులు ఐదేళ్లు సైన్యంలో ఎలాంటి ప్రతిఫలమూ లేకుండా పని చేయాలని జస్టిస్ జె.చలమేశ్వర్ పేర్కొనగా, వారంతా మళ్లీ వైద్య కోర్సు ప్రవేశ పరీక్ష రాయాలని మరో జడ్జి జస్టిస్ సప్రే స్పష్టం చేశారు.
2008-13 మధ్య జరిగిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపం) ఫలితాలను రద్దు చేసిన హైకోర్టు తీర్పులపై నిందితుల పిటిషన్‌ను సుప్రీం బెంచ్ విచారించి సోమవారం ఈ తీర్పు ప్రకటించింది. భిన్నాభిప్రాయాల వల్ల దీన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌కు నివేదించారు. తప్పు చేసినవారి నుంచి సమాజం ఏదోరకంగా పరిహారం అందుకోవాలని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. నిందితులు ఆర్మీలో ఐదేళ్లు పనిచేశాకే సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు.
‘వ్యాపం’ మెడికోలు ఆర్మీలో పనిచేయాలి
Published Tue, May 17 2016 2:09 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement